Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
krish direction

ఈ సంచికలో >> సినిమా >>

డోస్‌ పెంచబోతున్న జాన్వీకపూర్‌

dose increase

'ధడక్‌' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన అతిలోక సుందరి కుమార్తై జాన్వీకపూర్‌ తన తదుపరి చిత్రం తండ్రి బోనీకపూర్‌ నిర్మాణంలోనే ఉంటుందని తేల్చేసింది. కరణ్‌జోహార్‌ నిర్మాణంలో రూపొందిన 'ధడక్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. నటిగా జాన్వీకపూర్‌ తానేంటో ప్రూవ్‌ చేసుకుంది ఈ సినిమాతో. చిన్న చిన్న లోపాలున్నా, అవి తొలి సినిమా కాబట్టి కొట్టుకుపోతాయి. ఇక తదుపరి సినిమాలో జాన్వీ అసలు సిసలు నటన కనబరచనుందట. ఈ జనరేషన్‌ హీరోయిన్స్‌కి ఉండాల్సిన అన్ని రకాల క్వాలిటీస్‌తో జాన్వీ తెరంగేట్రం అదిరిపోయింది. ఇక ఆమె టాలెంట్‌ ఏంటనేది తదుపరి చిత్రం నుండి ఒక్కొక్కటిగా చూపించనుందట. సినిమాల్లోకి రాకముందే హాట్‌నెస్‌తో దడ పుట్టించేసింది జాన్వీ కపూర్‌.

'ధడక్‌'లో పెద్దగా ఎక్స్‌పోజింగ్‌కి స్కోప్‌ లేదు. కానీ రెండో చిత్రంలో హాట్‌నెస్‌ లెవల్స్‌ పెంచనుందనీ బాలీవుడ్‌ వర్గాల సమాచారమ్‌. ఇదిలా ఉంటే, జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ తెరంగేట్రం ఎప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ టాలీవుడ్‌ నుండి ఓ ప్రముఖ నిర్మాత జాన్వీ కోసం ఓ స్టోరీ రూపొందించారట. ఈ ప్రాజెక్ట్‌ విషయమై ఆయన ఆల్రెడీ బోనీకపూర్‌ని సంప్రదించారట కూడా. ఫైనల్‌ డెసిషన్‌ త్వరలోనే చెబుతానని సదరు నిర్మాతకు బోనీ మాటిచ్చారట. అయినా సినిమాల్లో ఇప్పుడు బౌండరీస్‌ చెరిగిపోయాయి. తెలుగు సినిమాలు హిందీలోనూ, హిందీ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు అందుకుంటున్నాయి. అలా జాన్వీ నటించిన 'ధడక్‌' తెలుగులోనూ విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలో జాన్వీ ఎప్పుడు నటిస్తుందో ప్రస్తుతానికి సస్పెన్సే మరి.! 

మరిన్ని సినిమా కబుర్లు
Kamal Haasan acting career is another time.