Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
big boss new glamour

ఈ సంచికలో >> సినిమా >>

హాటెస్ట్‌ ఆఫర్‌ పట్టేసిన పవన్‌ హీరోయిన్‌

hottest offer

'కొమరం పులి' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ నికీషా పటేల్‌కి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ హాట్‌ గాళ్‌గా పేరొచ్చింది. అయినా కానీ అవకాశాలు అరకొరగానే అందాయి ఈ ముద్దుగుమ్మకి. దాంతో అవకాశాల కోసం తనకున్న గ్లామర్‌ ఇమేజ్‌నే ఎరగా వేసి, సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోయింది. పాపం బాగానే కష్టపడింది. కాస్త బొద్దుగా ఉండే నికీషా పటేల్‌ కష్టపడి సన్నబడింది కూడా. ఎట్టకేలకు అమ్మడి కష్టం ఫలించింది. ఈ మధ్యనే కాస్త ఆఫర్లు దక్కుతున్నాయి. అందులో భాగంగానే 'గుంటూర్‌ టాకీస్‌' సీక్వెల్‌లో అమ్మడికి హాటెస్ట్‌ ఆఫర్‌ దక్కింది.

గతంలో బుల్లితెర యాంకర్‌ రేష్మీ హీరోయిన్‌గా నటించిన 'గుంటూర్‌ టాకీస్‌' చిత్రం రేష్మీకి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు, ఆ టైంలో ఓ మోస్తరు హిట్‌ సినిమాగా నిలిచింది. వాస్తవానికి రేష్మీ గ్లామరే ఈ సినిమాకి ప్లస్‌ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నికీషా పటేల్‌ తన హాట్‌ హాట్‌ అందాల్ని ఆరబోసేందుకు సిద్ధమైపోతోంది. మొదటి పార్ట్‌ని మించిన హాట్‌నెస్‌ ఈ సినిమాలో ఉండబోతోందట. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్‌ ఎక్కడా కనిపించలేదు. కానీ నికీషా పటేల్‌ ఈ సినిమా వివరాలను అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తోంది. చూడాలి మరి రేష్మీకి మంచి పేరు తెచ్చిపెట్టిన 'గుంటూర్‌ టాకీస్‌' మూవీ, నికీషాకి ఎలాంటి పాపులారిటీ తెచ్చిపెట్టనుందో. మరోవైపు నికీషా ప్రధాన పాత్రలో యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ఒకటి తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందీ సినిమా. 

మరిన్ని సినిమా కబుర్లు
krish direction