Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
writer induramana  interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం జోకులు - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

వింజామర కన్య విమల: మన రాణీ గారు, అందమైన కన్యలను వెతికి పట్టి , రాణివాసం ఇప్పిస్తారు. ఆ పిల్లలకి, మంచి బలిష్టమైన యువకులతో పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారే?
చీపురు కన్య చీనాదేవి: రాణీ గారికోతమ్ముడున్నాడు... వాడు కీచకుడికి మించినోడు... నీకు తెలీదా?

 

 

వింజామర కన్య వినీత: వింజామరలతో పనిలేదా? ఎందుకూ? వేరే చోటికి పోవాలా?
వింజామరకన్య విరితా: రాజుగారు కౌశీన వ్రతం లో వున్నారట! దుస్తులేసుకోరు. ఉక్కపట్టదు! వింజామరలతో వీచేపని లేదు. అందుకని మన చేతికి చేటలిచ్చి వంట శాలలో బియ్యం చెరగమన్నారు!!

 

 

వంటలక్క రంగక్క: రాజుగారూ, మంత్రిగారూ, సేనాధిపతి, నా కాళ్ళకి దణ్ణాలు పెట్టారు!!
సేవకురాలు సంతమ్మ: అయ్య బాబోయ్... ఎందుకేం?
వంటలక్క రంగక్క: అందరూ నా ఉప్పు తిని బతుకుతున్నారని చెప్పార్లె!!

 

 

వింజామర కన్య వినూత్న: రాజు గారు యుద్ధానికి వెళితే, ఆయనతో పాటు వింజామర కన్యలూ వెళ్ళాల్సిందే!
దీపాలు తుడిచే దివ్య: ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు వింజామరలు వీచాలా?
వింజామర కన్య వినూత్న: శతృ రాజు వెంట వచ్చే వింజామర కన్యలతో యుద్ధం చెయ్యాలి!
దీపాలు తుడిచే దివ్య: ఏ ఆయుధాలతో?
వింజామర వినూత్న: వింజామరలతో యుద్ధం చేస్తాం. ఈ వింజామర కర్రలు ఇనుప కర్రలు చివర్న పిడికత్తులు బిగించాం చూడు!

పిడకల పీర్ మహమదు: ( రహస్యంగా) నేను ఒకటికి రెండు  సార్లు స్నానం చేసి ఒంటికి అత్తరు రాసుకుంటే గానీ, మావిడ నన్ను పడగ్గదికి అనుమతించదు!
ఈటెల ఈసాప్: ఏం?
పిడకల పీర్ మహమదు: గోశాలలో, గుర్రాల శాలలో, ఏనుగుల శాలలో, పేడనెత్తి , గడ్డికలిపి పిసికి, పిడకలద్దే ఉద్యోగం కదా నేను చేసేది! అందుకని!!

 

 

పరిచారిక పంకజం: రాణిగారు ఉద్యానవనం లో విహరిస్తూ, మలయమారుతాన్ని ఆస్వాదిస్తూ, ఉల్లాసం గా వున్నారే...?
పరిచారిక పావని: రాజుగారికి మంత్రి వర్గం నుంచి పిలుపు వచ్చింది. సమావేశాల్లో తలమునకలై వున్నారు.
పరిచారిక పంకజం: రాజుగారు పక్కన లేకుండా, రాణిగారు ఉల్లాసం గా వుంటమా?
పరిచారిక పావని: పక్కనుంటే చీటికి మాటికి, అది పట్టుకురా... ఇది తీసుకురా అని పనులురమాయిస్తుంటారుగా...?


కొత్త కోమలయ్య: కోట గుమ్మానికి చచ్చిన కాకులను వేలాడ దీశారే?
పాత పరమేశం: అవి పొరుగు రాజ్యం కాకులు! ఆ రాజ్యం కాకులు, ఈ రాజ్యం లో వాలడానికి వీలు లేదు!!

 

 


వాహ్యాళికి వెళ్ళిన  రాణి: ఒశేవ్ నా కాలికి ముల్లు గుచ్చుకుంది. చరణదాసీలను వెంటనే పిలిపించండి.
చెలికత్తె: చరణదాసిని పిలిపించానమ్మా! (కాసేపట్లో ఒక చరణదాసి వస్తుంది)
చరణదాసి:  మహారాణీ, ఏకాలికి ముల్లు గుచ్చుకుందమ్మా?
మహారాణి: ఎడమకాలికి...
చరణదాసి: నేను మీ కుడి
 కాలు చరణదాసినమ్మా..!
మహారాణి: ఐతే... వెంటనే ఎడమకాలు చరణ దాసిని పిలిపించండి!
చరణదాసి: ఎడమకాలు చరణదాసి శెలవుపెట్టి వెళ్ళిందమ్మా...
మహారాణి:
నిన్ను ఎడమకాలు చరణదాసిగా నియమిస్తున్నాను.. వెంటనే నా కాలికి గుచ్చుకున్న ముల్లు తీయ్..! 

చరణదాసి: చిత్తం మహారాణీ... నాకు ఆర్నెల్ల పాటు శిక్షణ ఇవ్వందే నేనాపని చేయలేనమ్మా!!

రాజు రంగప్ప: మహారాణీ... నేను కారునలుపు..మీరు కారునలుపోనలుపు, మరి యువరాజు బంగారు వన్నెవానుతున్నాడే?
రాణి కమలమ్మ: గర్భవతిగా వున్నప్పుడు నేను రోజూ పుచ్చరసం తాగాను. అన్నంలో రజత భస్మం , కుంకుమ పువ్వు కలుపుకుని తిన్నాను! మీరు, మరీ నా ఆంతరంగిక విషయాల్లో జోక్యం కలిగించుకుంటున్నారు ప్రభో.. నాకు తెలీకడుగుతాను... మన మంత్రి గారు బంగారు చాయ .. మరి వారికి  కలిగిన పుత్ర రత్నం కారు నలుపు...! ఏమిటి మీ సమాధానం...?
రాజు రంగప్ప : నాకు
నుంది....వస్తా....!!

సామంత రాజు శ్యామి రెడ్డి : ఈరోజు కొలువులో హాస్యరస వల్లరి కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది కదూ....?
సామంత రాజు సోమినాయుడు : చక్రవర్తి గారు మన ప్రధాన విదూషకులకు శెలవు చీటీ ఇచ్చి, దేశాటనలకి పంపిచ్చేశారు తెలీదూ....?

మరిన్ని శీర్షికలు
katyayani serial writer interview