Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscopeaugust 3rd to august 9th

ఈ సంచికలో >> శీర్షికలు >>

యువతరం భారతీయ సంస్కృతిని ఎందుకు విస్మరిస్తోంది - ..

young people ignoring Indian culture

భారతీయ యువత, అమెరికా ఐరోపాల సంస్కృతి వల్ల విపరీతంగా ప్రభావితులై పోతున్నారన్న ఫిర్యాదు చాలా కాలంగా వినిపిస్తూ వస్తున్నది. ఆర్థికంగానే కాక, సంస్కృతి పరంగానూ, ఆహార విషయాలలోనూ కూడా భారతదేశం నిజంగా ప్రపంచీకృతం అయిపోతున్న తరుణంలో, మన యువతరం భారతీయతలోని విశిష్టతను మరచిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ? ఈ విషయంలో సద్గురు ఒక నూతన దృష్టికోణం ఆవిష్కరిస్తున్నారు.

 

యువత అంటే, కొన్ని విధాలుగా ఇంకా పూర్తిస్థాయిలో రూపకల్పన కానివారు. వాళ్ళు ఇంకా ఫలానా వ్యక్తిత్వంలోకి అంటూ పూర్తిగా పరిణమించలేదు. పరిణమిస్తున్న దశలో ఉన్న వారికి, పరిణామం పూర్తి అయిపోయిన వారి కంటే అవకాశాలూ, ఎక్కువ! మీరు ఓ మూసలో ఇరుక్కుపోయారు. వాళ్ళు ఇంకా అన్వేషణలోనే ఉన్నారు. వాళ్ళ వెతుకులాట ఇంకా కొనసాగుతూ ఉన్నది కనక, వాళ్ళేదో గొప్ప అయోమయ స్థితిలో ఉన్నట్టుగా అనిపించచ్చు. మీ గురించి మీ తల్లిదండ్రులు కూడా అలాగే అనుకొనే వారు, మీరేదో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని. పెరిగి పెద్దయిపోయిన వారికి, పెరుగుతున్న వాళ్లను చూసినప్పుడు, వాళ్ల మార్గాన్వేషణ ఏదో వాళ్లు చేసుకొంటున్నారన్న విషయం అర్థం కాదు.

వెనకటి తరాలు, ముఖ్యంగా గత రెండు మూడు తరాలు, తమ తరవాతి తరాలకు తమ వారసత్వపు విలువ తెలియజేయడంలో విఫలమయ్యాయి. ఎందుకంటే, వాళ్ల వారసత్వాన్ని వాళ్లే సరిగ్గా స్పృశించి చూసిన వాళ్లు కాదు. మీరే దాన్ని మీ జీవితంలో అనుసరించటం లేదు. మీరు పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ క్షణంలో మీరు అనుసరిస్తున్నవి మాత్రం అన్నీ పాశ్చాత్య పద్ధతులు కాదా? మీ షర్టు పాశ్చాత్యం. మీ ప్యాంట్ పాశ్చాత్యం. మీ తలకట్టు పాశ్చాత్యం. మీకు ధైర్యం చాలినంత వరకూ మీరు పాశ్చాత్య రీతులనే అనుసరించారు. వాళ్లు మరో నాలుగడుగులు ముందుకు పోతున్నారు. ధైర్యం చాలక మీరు వేయలేకపోయిన ముందడుగు, మీ తరవాతి తరాల వారు వేయాల్సిందే. అది లోక సహజం. మీ భారతీయత ఏపాటిది? బహుశా మీరు ఆహారం విషయంలో మాత్రం భారతీయ సంప్రదాయం అనుసరిస్తారేమో! వాళ్ళు 'చెత్త తిండి' (జంక్ ఫుడ్) ని అభిమానించటం మొదలుపెట్టారు. వాళ్లకు 'మెక్ డానల్డ్స్' రుచిస్తుంది, మీరేమో సాంబారు ఇష్టపడతారు. ఇంతకంటే గొప్ప తేడా ఏముంది?

అందుచేత, మీరు మీ సంస్కృతిని చక్కగా పరిశీలించుకొని, అందులో విలువైన అంశాలను వెలికి తీయండి. అమెరికాలో ఉన్న రెండోతరం భారతీయులలో యువత కొందరు ఇప్పుడు నా మార్గానికి తిరిగి వస్తున్నారు. వాళ్ళకి అందులో గొప్ప విలువ కనిపిస్తున్నది. వాళ్ళకు ఆ విలువ చూపించండి. వాళ్లనేదో మార్చి వేసేందుకు ప్రయత్నించద్దు. మీరు చెప్పే దానిలో ఉన్న విలువ వాళ్లకు ఎలా మనసుకెక్కించాలో మీకు తెలియకపోతే, వాళ్లు ఎలాగూ మారరు. 'నువ్వు పిజ్జా తినద్దు. దోస తిను!' అని చెప్పి ప్రయోజనం లేదు. వాళ్లు పిజ్జానే తింటారు!

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని శీర్షికలు
The mother tongue goes back.