కావలసిన పదార్థాలు:
పెసరపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, నూనె, టమోట, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి రేకలు, ఎండుమిర్చి, కరివేపాకు
తయారుచేయు విధానం:
ముందుగా పెసరపప్పుని మెత్తగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తరువాత దానిని గరిటతో మెత్తగా నలిపి, దానికి సరిపడినంత నీళ్ళు పోసుకోవాలి. తరువాత దానిలో పసుపు, సరిపడినంత ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, కోసిన టమోటా వేసి బాగా మరగనివ్వాలి. (పెసరపప్పులో పోషకవిలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచిది.) ఇది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. తరువాత పోపు వేసుకోవాలి. ముందుగా బాణీలో నూనె వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి రేకలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగిన తరువాత ఉడికించిన పెసరపప్పు చారును దీనిలో కలుపుకుంటే ఘుమఘుమ లాడే పెసరపప్పు చారు రెడీ. దీనిని ఫ్రై తో గాని, అప్పడాలు, వడియాలుతో గాని తింటే బాగుంటుంది.
|