బుల్లితెరపై ప్రసారమవుతున్న మెగా రియాల్టీ షో 'బిగ్‌బాస్'కి అంతకంతకూ క్రేజ్ పెరుగుతున్న తరుణంలో ఆ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నానిపై మాత్రం నెగిటివిటీ పెరుగుతూనే ఉంది. ఎన్టీఆర్‌తో నానిని పోల్చుతూ, సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్‌పై నాని ఓ సారి క్లాస్ తీసుకున్నాడు కూడా. ముఖ్యంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ కౌషల్‌కి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన సపోర్ట్ లభిస్తోంది. 'కౌషల్ ఆర్మీ' పేరుతో సోషల్ మీడియాలో నానిని ఓ ఆటాడేసుకుంటున్నారు. ఇటీవల ఓ టాస్క్‌కి సంబంధించి నందిని, కౌషల్‌ని ఇరికించేసింది. ఈ విషయంలో నాని, కౌషల్‌ని హెచ్చరించాడు. దాంతో సోషల్ మీడియాలో కౌషల్ ఆర్మీ చెలరేగిపోయింది. ప్రోమోల కోసం కౌషల్ కావాలి. కౌషల్ చుట్టూ తిరిగే కాంట్రవర్సీలే షోకి హైలైట్ అవుతున్నాయి. ప్రోమోస్‌కి ఉపయోగపడుతున్నాయి.
కానీ ఇంటి సభ్యుల నుండి కానీ, హోస్ట్ నాని నుండి కానీ కౌషల్‌పై పోజిటివిటీ ఏర్పడట్లేదు అనేది కౌషల్ ఆర్మీ రైజ్ చేస్తున్న ఇష్యూ. ఇదిలా ఉంచితే, ఈ వారం ఎక్స్ కంటెస్టెంట్స్ శ్యామల, నూతన్ నాయుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి ఎంట్రీతో హౌస్‌కి మరింత కళొచ్చింది. ఈ వారం మరో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ విశ్వనటుడు కమల్ హాసన్ బిగ్‌హౌస్‌లో సందడి చేశారు. 'విశ్వరూపం 2' సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కాస్సేపు సరదాగా కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు. అంతేకాదు, అమిత్‌కి రెండు వారాల ఎక్స్‌టెన్షన్ కార్ట్‌ని బంపర్ ఆఫర్‌గా ఇచ్చారు. ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఎప్పటిలాగే కౌషల్, గణేష్, తనీష్, శ్యామల, దీప్తి ఉన్నారు. చూడాలి మరి, వీరిలో ఎవరు ఈ వారం హౌస్ నుండి బయటికి వెళ్తారో.!
|