బృహన్నల తరహా క్యారెక్టర్స్‌లో ఇప్పటికే పలువురు హీరోలు సత్తా చాటారు. అయితే తాజాగా యంగ్ హీరో నాగశౌర్య ఆ తరహా క్యారెక్టర్‌లో సందడి చేయబోతున్నాడు. 'ఛలో' హిట్‌తో జోరు మీదున్న నాగశౌర్య ప్రస్తుతం 'నర్తనశాల' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ ఆశక్తిగా ఉంది. అయితే పేరుకు, టీజర్‌లో చూపించిన కంటెన్ట్‌కీ అస్సలు పొంతన లేదు. చిన్నతనం నుండీ అమ్మాయిలా పెరగడం వల్ల అదే లక్షణాలతో పెరిగి పెద్దవాడయ్యే హీరో. వయసుకు వచ్చిన తర్వాత ఏంటీ.! నా కొడుకు గేనా..' అని ఆశ్చర్యపోయే తండ్రి.. ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో అక్కడక్కడా సెటైరికల్ డైలాగ్స్‌తో టీజర్‌ని ఆశక్తికరంగా కట్ చేశారు.
అయితే ఇలాంటి క్యారెక్టర్‌ని నాగశౌర్య ఎందుకు ఎంచుకున్నాడనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ త్వరలోనే తెలిసిపోతుంది కంగారేం పడొద్దంటోంది చిత్ర యూనిట్. సొంత బ్యానర్‌లో రూపొందించి 'ఛలో' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అదే స్పీడుతో ఈ సినిమాని కూడా సొంత బ్యానర్‌లోనే రూపొందించాడు నాగశౌర్య. ఇకపోతే ఈ సినిమాలో యామినీ భాస్కర్, కశ్మీరా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'కాటమరాయుడు' సినిమాతో యామినీ భాస్కర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. కానీ అంతగా రిజిస్టర్ కాలేదు ఆ సినిమాలో. ఈ సినిమాలో అమ్మడికి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కిందట. క్యారెక్టర్ తేడా అయినా మనోడికి అన్నీ ఎక్కువేనట. ఆ ఎక్కువేంటో మాత్రం సినిమాలో చూడాల్సిందేనండోయ్. ఫుల్ లెంగ్త్ కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం అయితే పక్కా అని స్పష్టమవుతోంది టీజర్‌ని బట్టి. అందుకైతే సిద్ధమైపోండి మరి.
|