Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Big boss is nani

ఈ సంచికలో >> సినిమా >>

విజయ్‌ దేవరకొండది విప్లవం కాదు, ప్రేమ.!

Vijay Devarakonda is not revolution, love.

సెన్సేషనల్‌ అంటే సెన్సేషనలే. ప్రతీ సినిమాకీ ఓ సెన్సేషన్‌ సృష్టిస్తున్నాడీ యంగ్‌ హీరో. ఆయన ఎవరో కాదు, విజయ్‌దేవరకొండ. సెన్సేషన్‌కి కేరాఫ్‌ ఆడ్రస్‌గా మారిపోయాడీ తెలంగాణా కుర్రోడు. అయితే విజయ్‌దేవరకొండ ఇంతవరకూ చేసిన చిత్రాల్లో తెలంగాణా ఫ్లేవర్‌నే తెరపై చూపించాడు. తెరపై ఎలా ఉంటాడో, బయట కూడా అదే ఆటిట్యూడ్‌, బాడీ లాంగ్వేజ్‌తో కనిపించడం మనోడి స్పెషాలిటీ. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌. ప్రస్తుతం మనోడు తన ఆటిట్యూడ్‌ణి ఛేంజ్‌ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఎందుకంటారా.? 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రం కోసం. శ్రీనివాస్‌ చక్రవర్తి అనే యంగ్‌స్టర్‌ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. 'రంగస్థలం' సినిమాతో తిరుగులేని విజయం అందుకున్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.

రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. విశేషమేంటంటే ఇంతవరకూ తన సినిమాల్లో తెలంగాణా ఫ్లేవర్‌ని పీక్స్‌లో చూపించిన విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో అసలు సిసలు ఆంధ్రా కుర్రోడిలా దర్శనమివ్వబోతున్నాడు. టైటిల్‌ చూస్తే ఇదేదో విప్లవాత్మక సినిమా అనుకున్నారంతా. కానీ కాదట. ప్రియురాలి కోసం ప్రేమ పోరాటం చేసే యువకుడిగా విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. పైగా టిపికల్‌ గోదారి జిల్లాల యాసలో డైలాగులు అదరగొట్టేయబోతున్నాడట. అంతేకాదు, ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండబోతోందనీ, ఓ ప్రముఖ హీరోయిన్‌ని ఇప్పటికే ఎంగేజ్‌ చేశారనీ సమాచారమ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
Devdas, who is going to be in the madness