Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష శ్రీనివాస కళ్యాణం

srinivasakalyanam movie review

చిత్రం: శ్రీనివాస కళ్యాణం 
తారాగణం: నితిన్‌, రాశి ఖన్నా, నందిత శ్వేత, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, సత్యం రాజేష్‌, ప్రవీణ్‌ తదితరులు. 
సంగీతం: మిక్కీ జె మేయర్‌ 
సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి 
దర్శకత్వం: సతీష్‌ వేగేశ్న 
నిర్మాత: దిల్‌ రాజు, శిరీష్‌ 
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 10 ఆగస్ట్‌ 2018 

క్లుప్తంగా చెప్పాలంటే 
సంప్రదాయ కుటుంబం, పైగా విలువలకు కట్టుబడి వుండే కుటుంబం నుంచి వచ్చిన యంగ్‌స్టర్‌ శ్రీనివాస్‌ (నితిన్‌), ఆ విలువల్ని పక్కన పెట్టి, డబ్బు సంపాదనే పరమావధిగా, వ్యాపార సూత్రమే విజయానికి నిలువుటద్దంగా ఆలోచించే ఆర్కే (ప్రకాష్‌రాజ్‌) కుమార్తె శ్రీదేవి (రాశి ఖన్నా)తో ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్ళంటే ఓ వేడుకలా వుండాలనే ఆలోచనతో, ఆ స్థాయిలో తన పెళ్ళి జరగాలనుకుంటాడు. నానమ్మ (జయసుధ) తన మనవడి పెళ్ళిని ఉత్సవంగా చేయాలనే ఆలోచనతో వుంటుంది. ఆర్కే మాత్రం, సంప్రదాయాల్ని పక్కన పెట్టి, వ్యాపారానికే ఎక్కువ విలువ ఇస్తాడు. తూర్పు పడమర లాంటి భావజాలం మధ్య శ్రీనివాస్‌ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు.? అనేది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
శ్రీనివాస్‌ పాత్రలో ఎనర్జీ తగ్గింది. అది హీరో నితిన్‌ తప్పు కాదు. క్యారెక్టర్‌ని అండర్‌ ప్లే చేయాల్సి రావడమంటే ఏ నటుడికి అయినా అది అగ్ని పరీక్షే. ఆ పరీక్షలో నితిన్‌ విజయం సాధించాడు. నిజానికి ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే ముందుగా నితిన్‌ని అభినందించి తీరాలి. ఎనర్జీ లేకపోవడం లోటు అయినా, ఆ పాత్రకు కావాల్సింది అదే. ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో ఎప్పుడూ ఆకట్టుకోవాలని చూసే నితిన్‌, ఈసారి ఆ ఎనర్జీని అండర్‌ ప్లే చేసి ఫుల్‌ మార్క్స్‌ కొట్టేశాడు. రాశి ఖన్నాకి మంచి పాత్ర దక్కినా, ఆమెని దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. వున్నంతలో తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించింది రాశి ఖన్నా. 
జయసుధ, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, సత్యం రాజేష్‌, ప్రవీణ్‌ తదితరులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. ప్రకాష్‌రాజ్‌ తనకు దక్కిన పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. 

కథ కొత్తదేమీ కాదు. కథనం పరంగానూ కొత్తదనం గురించి పెద్దగా ఆలోచించినట్లు అన్పించదు. మాటలు ఆకట్టుకుంటాయి. కథనంలో వేగం వుంటే, ఆ మజానే వేరు. సంగీతం ఓకే. పాటలు తెరపై చూడ్డానిక బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగానే వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌కి ఇంకాస్త పని చెప్పి వుంటే బావుండేదన్పిస్తుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది. 
చాలా అరుదుగానే ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే సినిమాలొస్తుంటాయి. ఇలాంటి సినిమాల విషయంలో దిల్‌ రాజుది అందె వేసిన చెయ్యి. ఆయన సినిమాల్లో గ్రాండ్‌నెస్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కమర్షియల్‌ సినిమాలతోపాటుగా, ఫ్యామిలీని మెప్పించే సినిమాలు చేయాలన్న నిర్మాతని అభినందించి తీరాలి. దర్శకుడూ ఓ మంచి విషయాన్ని చెప్పాలనే ప్రయత్నం చేశాడుగానీ, ఆ 'మంచి' బలవంతంగా రుద్దేశాడన్న భావన కలుగుతుంది. పెర్‌ఫెక్ట్‌ పెయిర్‌ ఆన్‌స్క్రీన్‌ కన్పిస్తున్నప్పుడు, వారిలోని ఎనర్జీని బాగా వాడుకుంటే ఇంకా బెటర్‌ ఔట్‌పుట్‌ వచ్చి వుండేది. భారీ స్టార్‌ కాస్టింగ్‌ కూడా సద్వినియోగం కాలేదన్పించడం మైనస్‌ పాయింట్‌. ఓవరాల్‌గా సినిమా ఓ మోస్తరుగా ఆకట్టుకునే అవకాశాలున్నాయి. ప్రయత్నాన్ని అభినందించాల్సిందేగానీ, ఆ ప్రయత్నం భారంగా వుందనే భావన కష్టమే. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
ఈ కళ్యాణం మరీ అంత పెద్ద వేడుక ఏమీ కాదు 

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
churaka