Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Vijay Devarakonda is not revolution, love.

ఈ సంచికలో >> సినిమా >>

మత్తులో అల్లరల్లరి చేస్తామంటోన్న 'దేవ్‌దాస్‌'

Devdas, who is going to be in the madness

నాగార్జున - నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'దేవదాస్‌'. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫన్‌తో రూపొందుతోన్న చిత్రమిది. యంగ్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌తోనే సినిమా స్వరూపం ఏంటో చెప్పకనే చెప్పేశారు. నాని, నాగార్జున ఫుల్‌గా తాగేసి ఒకే బెడ్‌ మీద పడుకుని ఉన్నారు. 'వీళ్లకి మత్తింకా దిగలేదు. దిగిందంటే అంతే సంగతి అల్లరే అల్లరి..' అంటూ ఈ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నాగార్జున చేతిలో గన్‌ ఉంది. ఈ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో నాగార్జునది దేవ అనే ఓ డాన్‌ క్యారెక్టర్‌ అనీ, నాని 'దాస్‌' అనే డాక్టర్‌ పాత్రలో కనిపించబోతున్నాడనేది  తెలిసిన సంగతే. అయితే ఓ డాక్టర్‌కీ, డాన్‌కీ ఏంటి సంబంధం.? ఇదే ఈ స్టోరీలోని ట్విస్ట్‌. దేవా అనే క్యారెక్టర్‌ని గతంలో నాగార్జున 'హలో బ్రదర్‌' సినిమాలో పోషించాడు. పక్కా మాస్‌ క్యారెక్టర్‌ అది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా అంతే మాస్‌ మసాలా ఆటిట్యూడ్‌తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. అలాంటి మాస్‌ క్యారెక్టర్‌ని మ్యాచ్‌ చేయడం నానికి అంత ఈజీ ఏం కాదు. అలాగని మాస్‌లో నాని కూడా ఏమాత్రం తక్కువ కాదు. చెలరేగిపోతాడట. ఇద్దర్నీ పోల్చలేం కానీ, ఏ ఒక్కరూ ఇంకొకరితో తక్కువ కాదని చెప్పగలం. సెప్టెంబర్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మళ్లీ రావా' ఫేం ఆకాంక్షసింగ్‌ ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా నటిస్తోంది. ఇకపోతే క్రేజీ భామ రష్మికా మండన్నా నానితో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ చేయనుంది. 
 

మరిన్ని సినిమా కబుర్లు
'Modern Brihanna' is a Nagasauraya!