'పెళ్లిచూపులు' సినిమాతో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ అనిపించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'అర్జున్‌రెడ్డి'తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా మరో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు 'గీత గోవిందం' సినిమాతో. ఈ తాజా హిట్‌తో మనోడికింక తిరుగే లేదనిపిస్తోంది. ఆటిట్యూడ్ పరంగా విమర్శలు ఎదుర్కొంటున్నా, అలాంటి విమర్శల్ని డోంట్ కేర్ అంటున్నాడు. సక్సెస్‌లతోనే తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తున్నాడు. అయినా ఆ ఆటిట్యూడ్‌కే ఇప్పుడు యువత ఎట్రాక్ట్ అవుతోంది. అర్జున్‌రెడ్ది సినిమా వచ్చాక, ఆ సినిమా ప్రభావం యువతపై ఏ స్థాయిలో పడిందంటే చెప్పడమే కష్టం. 'పెళ్లిచూపులు' ఓ రకం. 'అర్జున్‌రెడ్డి' మరో రకం.
తాజాగా విడుదలైన 'గీత గోవిందం' ఇంకో రకం. ఇలా సినిమా సినిమాకీ మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు విజయ్ దేవరకొండ. 'టాక్సీవాలా', 'డియర్ కామ్రేడ్', 'నోటా' వరుస సినిమాలు విజయ్‌దేవరకొండ చేతిలో ఉన్నాయి ప్రస్తుతం. వాటిలో 'టాక్సీవాలా' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మిగిలిన సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. చూడ్డానికి సాదా సీదా హీరోగా కనిపిస్తున్నాడేమో కానీ, ఓ స్టార్ హీరో అయ్యేందుకు అన్ని అర్హతలు తనలో ఉన్నాయనీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విజయ్ దేవరకొండకు కితాబివ్వడం విశేషం. ఇక 'గీత గోవిందం' విషయంలో అంచనాలకు మించి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా వసూళ్ల జాతర కనిపిస్తోంది.
|