రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సినిమా 'అరవింద సమేత వీర రాఘవ'. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో టీజర్ ప్రభంజనం సృష్టిస్తోంది. 'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా..? అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో బేస్ వాయిస్‌తో జగపతిబాబు చెప్పే పవర్‌ఫుల్ డైలాగులు టీజర్‌లో మెయిన్ హైలైట్ అయ్యాయి. ఎన్టీఆర్ పర్‌ఫామెన్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎన్టీఆర్ డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
'కంటపడ్డావో కనికరిస్తానేమో.. వెంట పడ్డానో నరికేస్తావోబా..' అంటూ రాయలసీమ యాసలో ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ బాడీతో కొత్తగా కనిపిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో గతంలో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో చాలా వరకూ సూపర్‌హిట్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటికీ మించి ఈ సినిమా ఉండబోతోందట. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
|