రష్మీ అనగానే హాట్ అండ్ స్పైసీ అందాల భామ గుర్తొస్తుంది. కొన్ని హారర్ సినిమాలతో భయపెట్టే ప్రయత్నం కూడా చేసింది రష్మీ. కొంచెం ఏంటి. రష్మీ చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం హారర్ చిత్రాలే. అయితే గ్లామర్ మిస్ కాలేదులెండి. ఇకపోతే ఈ సారి కొంచెం కొత్తగా ట్రై చేసింది రష్మీ. గ్లామర్, హారర్‌తో పాటు, యాక్షన్ యాంగిల్ కూడా చూపించేసింది. యాక్షన్ సీన్స్‌లో నటించడమంటే మాటలు కాదు కదా. అప్పుడప్పుడూ దెబ్బలు కూడా తగులుతాయి. రష్మీ కూడా అలాగే దెబ్బలు తగిలించుకుంది. ఇంతకీ ఇదంతా ఏ ఎందుకోసం అంటే, 'అంతకుమించి' సినిమా కోసం. రష్మీ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రమిది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలోనే రష్మీ గ్లామర్‌తో పాటు, యాక్షన్ సీన్స్‌లో కూడా నటించేసిందట.
డూప్స్ వాడదామని డైరెక్టర్ చెప్పినా, వద్దని వారించి, తానే స్వయంగా యాక్షన్ సీన్స్‌లో నటించిందట. ఆ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ కానున్నాయట. ఇటీవల ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్‌లో అయితే రష్మీ గ్లామర్ యాంగిల్‌ని చూపించారు. అది కూడా టైటిల్‌కి తగ్గట్టుగా అంతకు మించి అనేంతలా. అయితే సినిమాలో అది మాత్రమే కాదు, తనలోని కొత్త యాంగిల్ చూడబోతున్నారంటూ కాన్ఫిడెంట్‌గా రష్మీ చెప్పేస్తోంది. జానీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
|