Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Sira' mega teaser is coming!

ఈ సంచికలో >> సినిమా >>

అంతరిక్షంలో మెగా ప్రయత్నం

Mega effort in space

హైద్రాబాద్‌లోనే ట్యాంక్‌బండ్‌ పక్కన ఓ సెట్‌ వేసేసి అందులో చాలా వరకూ సినిమాని షూట్‌ చేసేశాడు ఓ యువకుడు. తెరపై సినిమా చూస్తే ఇంత అద్భుతం ఎలా సాధ్యం అనిపించింది ప్రేక్షకులకు. ఇప్పటికవరకూ ఎవ్వరూ టచ్‌ చేయని సబ్‌మెరైన్‌ కాన్సెప్ట్‌తో ఆ అద్భుతాన్ని రూపొందించాడు ఆ యువకుడు. ఆయన ఎవరో కాదు. యంగ్‌ డైరెక్టర్‌ సంకల్ప్‌రెడ్డి. ఈ యంగ్‌స్టరే తాజాగా మరో అద్భుతానికి తెర లేపాడు. అదే 'అంతరిక్షం'. మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటిదాకా వరుణ్‌ తేజ్‌ చేసిన సినిమాలు తీసుకుంటే, చాలా వరకూ ప్రయోగాత్మక సినిమాలే కనిపిస్తాయి.

ఈ 'అంతరిక్షం' కూడా ఆ కోవలోకే వెళుతుంది. తమిళంలో ఇటీవల 'టిక్‌ టిక్‌ టిక్‌'' అనే సినిమా వచ్చింది. అది కూడా అంతరిక్షం నేపథ్యంలోనే సాగింది. కానీ సంకల్ప్‌రెడ్డి రూపొందిస్తున్న 'అంతరిక్షం' సంగతి వేరు. ఖచ్చితంగా సాంకేతిక అద్భుతం కాబోతోందీ సినిమా. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే సినిమా అవుతుంది. అదితీరావ్‌ హైదరీ, లావణ్య ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. జీరో గ్రావిటీ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం అదితీ రావ్‌ హైదరీ, వరుణ్‌పై త్రీడీ స్కానింగ్‌ నిర్వహించారు. ఇండిపెండెన్స్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్‌లో వరుణ్‌తేజ్‌ ఆస్ట్రోనాట్‌ గెటప్‌లో అంతరిక్షంలో ఏదో పరిశీలిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
narikestavoba.' This is a young tiger warning