'బాస్ ఈజ్ బ్యాక్' అని 'ఖైదీ నెంబర్ 150' సినిమాతోనే అనుకున్నాం. చిన్న గ్యాప్.. అంతే. మళ్లీ 'సౖరా నరసింహారెడి'్డతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే ఆగస్టు 21న 'సైరా' టీజర్‌ని విడుదల చేశారు. టీజర్‌లో ఏముంది? అని ఆలోచిస్తే, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. అంతకు మించి అభిమానులు ఇంకేం ఆశిస్తారు.? కోట బురుజు మీద జెండా చేతబట్టిన మెగాస్టార్ ఎంట్రీ దగ్గర్నుంచీ, చివర్లో గుర్రాన్ని రెండు కాళ్ల మీద నిలబడేలా చేసిన ఫీట్ వరకూ ఆశ్చర్యంతో చూసిన ప్రతీ ఒక్కరూ న భూతో న భవిష్యతి అనేశారు. టీజర్ బంపర్ హిట్ అనడానికి అంతకన్నా నిదర్శనం ఇంకేం అవసరం లేదు.
అయితే టీజర్ గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా రత్నవేలు సినిమాటోగ్రఫీ, దాంతో పాటుగా అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచాయి. టీజర్ చూస్తున్నంత సేపూ, ఇవే ప్రేక్షకుల్ని ఇంకో లోకంలోకి తీసుకెళ్లిపోయాయి. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎలా ఉంటాడో చిరంజీవిని అలా ఈ టీజర్‌లో చూసేశాం. అందుకే టీజర్‌కి వ్యూస్ పోటెత్తాయి. 1.5 కోట్లు వ్యూస్ దాటి 2 కోట్లు వ్యూస్ వైపు పరుగులు పెట్టేస్తోంది. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ ఇదొక రికార్డు. సో 'సైరా' రికార్డుల వేట మొదలైనట్లే కదా. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతీ ఫ్రేములో సురేందర్ రెడ్డి మార్క్ టేకింగ్ స్పష్టంగా కనిపించింది.
|