'గరుడవేగ' తర్వాత రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం సంగతులు త్వరలోనే తెలియనున్నాయి. అంత కన్నా ముందు, రాజశేఖర్ ఇన్ ఏ న్యూ అవతార్, టైటిల్ ఫస్ట్‌లుక్ ఇన్ ఆగస్గు 26, హూ ఈజ్ ద మర్డరర్.? అంటూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌తో కూడిన ఓ ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇది రాజశేఖర్ కొత్త చిత్రం టైటిల్‌కి సంబంధించిన చిన్న హింట్ అన్న మాట. ఇంతకీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నది ఎవరో తెలుసా? నాని సమర్పణలో 'అ' సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని విశేషంగా ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ఈ యంగ్ డైరెక్టర్, సీనియర్ హీరో అయిన రాజశేఖర్‌తో తెరకెక్కిస్తున్న సినిమానే ఇది. ఈ ప్రీ లుక్‌ని బట్టి టైటిల్ 'అవతార్' అయ్యి ఉంటుందని ఊహిస్తున్నారు. అయితే ఈ ఊహకు చెక్ పెట్టాలంటే, ఆగస్టు 26 వరకూ ఆగితే సరిపోతుంది. ప్రీ లుక్‌ని బట్టి టైటిల్ ఆగస్టు 26 రిపబ్లిక్ డే సందర్భంగా రానుందని తెలుస్తోంది. తన ఆలోచనలు ఎంత భిన్నంగా ఉంటాయో తొలి చిత్రం 'ఆ'తోనే నిరూపించేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సినిమా ఎంతటి ఘన విజయం సాధించింది అనే విషయం పక్కన పెడితే, ఫస్ట్‌లుక్ రిలీజ్ నుండే అందరూ 'అ' సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇక తాజా చిత్రంలో ఇంకెన్ని మ్యాజిక్స్ చేయబోతున్నాడో. ఇక రాజశేఖర్ విషయానికి వస్తే, యాంగ్రీ ఎంగ్‌మేన్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన రాజశేఖర్‌ని జనం మర్చిపోయిన సమయంలో 'గరుడవేగ' చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాతో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇక తాజా సినిమాతో ఏం చేస్తాడో చూడాలిక. సినిమా సంగతుల్లోకి వెళితే, సినిమా మొత్తం తెలంగాణా స్లేంగ్‌లో పూర్తి తెలంగాణా ఫ్లేవర్‌తో ఉండబోతోందట.
|