Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Rushmi again hit back.

ఈ సంచికలో >> సినిమా >>

యూటర్న్‌' సమంతకు మరో హిట్‌ కన్‌ఫామ్‌.!

Samantha is another hit!

కన్నడలో ఘన విజయం సాధించిన 'యూటర్న్‌' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. సమంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదో థ్రిల్లర్‌ మూవీ. జర్నీ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ కథాంశంతో రూపొందింది. కన్నడ 'యూటర్న్‌'ని రూపొందించిన పవన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్‌ చేస్తున్నారు. ఇటీవలే టీజర్‌ విడుదలైంది. టీజర్‌ విడుదలయ్యాక సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సమంత బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు చేశారట.

ఈ సినిమాకి సమంత ఓన్‌గా డబ్బింగ్‌ చెప్పుకుంది. జర్నలిస్టు పాత్రలో సమంత నటిస్తోంది. అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కున్న సమంత ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంది అనే కథాంశాన్ని థ్రిల్లింగ్‌ అంశాలు జోడించి రూపొందించిన సినిమా ఇది. ఆ కేసు ఇన్వెస్టిగేట్‌ చేసే పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కలసి నటించిన 'రంగస్థలం' సినిమా బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. 'యూ టర్న్‌'తో మరో హిట్‌ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఈ బావా మరదళ్లు (రంగస్థలం క్యారెక్టర్స్‌) రెడీగా ఉన్నారు. అసలే సమంతకు ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతుంది. అంతా గెలుపే. ఓటమి అనేదే లేదు. వరుస విజయాలతో దూసుకెళ్లిపోతోంది. త్వరలోనే రియల్‌ లైఫ్‌ భర్త చైతూతో పెళ్లి తర్వాత తొలిసారిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతోంది. 'నిన్నుకోరి' దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది.

మరిన్ని సినిమా కబుర్లు
Rajeshkar's 'avatar'