టాలీవుడ్‌లో ఎక్కడ విన్నా రష్మికా గురించే డిస్కర్షన్. రష్మిక ఉంటే సినిమా హిట్టేనని జనం ఫిక్సయిపోయారు. నాని, నాగార్జున కాంబినేషన్‌లో హిట్ రెడీగా ఉంది రష్మికాకి. విజయ్ దేవరకొండతో మరోసారి 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తోంది. 'గీత గోవిందం' సినిమా ఎఫెక్ట్ 'డియర్ కామ్రేడ్'పై చాలా గట్టిగా పడుతోంది. ఆ సినిమా బిజినెస్ ఎవరూ ఊహించని రేంజ్‌లో జరగుతుందని అంటున్నారు. మరోపక్క రష్మికా రెమ్యునరేషన్ అనూహ్యంగా పెంచేసిందట.
యూఎస్‌లో 'అర్జున్‌రెడ్డి' వసూళ్లను 'గీత గోవిందం' సినిమా ఫస్ట్ వీక్‌లోనే దాటేసింది. ఈ దెబ్బతో రష్మికాకి ఓవర్సీస్‌లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఈమె నటించిన తొలి చిత్రం 'ఛలో' కూడా అక్కడ మంచి వసూళ్లు కొల్లగొట్టింది. ఇక 'గీత గోవిందం' సినిమాతో రష్మికా నుండి రాబోయే సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అతి త్వరలోనే 'దేవదాస్' చిత్రంతో రాబోతోంది. ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తోంది రష్మికా. వరుస విజయాలతో దూకుడు మీదున్న నానికి 'కృష్ణార్జున యుద్ధం'తో బ్రేక్ పడింది. రష్మికా రాకతో 'దేవదాస్' సినిమా సూపర్ హిట్ అయ్యి, మళ్లీ నాని బండి ఫుల్ జోష్‌తో పట్టాలెక్కేయడం ఖామయని అంచనా వేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండకైతే ఇప్పట్లో మళ్లీ తిరుగు లేదనే అంటున్నారు. 'డియర్ కామ్రేడ్' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆడియన్స్‌లో 'గీత గోవిందం' క్రేజ్ చల్లారకముందే ఈ సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచన చేస్తున్నాడట విజయ్ దేవరకొండ.
|