Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నీ వెవరో చిత్రసమీక్ష

neevevaro movie review

చిత్రం: నీవెవరో 
తారాగణం: ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, ఆదర్శ్‌, శివాజీ రాజా, తులసి, సత్యకృష్ణన్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌ 
దర్శకత్వం: హరినాథ్‌ 
నిర్మాత: ఎంవివి సత్యనారాయణ 
నిర్మాణం: ఎంవివి సినిమాస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌ 
విడుదల తేదీ: 24 ఆగస్ట్‌ 2018

క్లుప్తంగా చెప్పాలంటే 
పదిహేడేళ్ళ వయసులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కళ్ళు కోల్పోతాడు కళ్యాణ్‌ (ఆది పినిశెట్టి). కంటి చూపు లేకపోవడం తన ఎదుగుదలకు అడ్డంకి కాబోదని నిరూపిస్తూ, చెఫ్‌ అవతారమెత్తి పెద్ద రెస్టారెంట్‌ నడుపుతుంటాడు కళ్యాణ్‌. అను, కళ్యాణ్‌కి చిన్నప్పటినుంచీ ఫ్రెండ్‌. దాంతో కళ్యాణ్‌, అను (రితికా సింగ్‌)ల పెళ్ళి జరిపించాలనుకుంటారు పెద్దలు. మరోపక్క కళ్యాణ్‌కి వెన్నెల (తాప్సీ)తో పరిచయం ప్రేమగా మారుతుంది. అనూహ్యంగా కళ్యాణ్‌ మరో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. వైద్యులు అతనికి శస్త్ర చికిత్స నిర్వహిస్తారు, కళ్యాణ్‌కి కళ్ళు కూడా వస్తాయిగానీ, కళ్ళు తెరిచి చూసేసరికి వెన్నెల కన్పించదు. వెన్నెల ఏమయ్యింది? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే 
కళ్ళు లేని వ్యక్తిగా ఆది పినిశెట్టి నటన ఆకట్టుకుంటుంది. తెరపై నిండుగా కన్పించే ఆది పినిశెట్టి ఏ పాత్రలో అయినా జీవించేస్తాడు. నటన పరంగా అతనికి వంక పెట్టడానికేమీ లేదు. కళ్యాణ్‌ పాత్రలో రకరకాల షేడ్స్‌ని చాలా ఈజీగా చూపించేశాడు ఆది పినిశెట్టి. సినిమా చూశాక అతని నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు.

ఆది పినిశెట్టి తర్వాత అంతటి ప్రాధాన్యమున్న పాత్ర తాప్సీది. తన నటనతో మరోమారు భళా అన్పించుకుంది తాప్సీ ఈ సినిమాతో. అందంగా కన్పించింది, అభినయంతోనూ ఆకట్టుకుంది. రితికా సింగ్‌ పాత్ర నిడివి తక్కువే. వున్నంతలో బాగానే చేసింది. తులసి, శివాజీ రాజా హీరో తల్లిదండ్రులుగా బాగా చేశారు. వెన్నెల కిషోర్‌ కాస్సేపు హంగామా చేస్తాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. 
కథ పరంగా చూస్తే కాస్త కొత్తగానే అన్పిస్తుంది. అయితే ఇలాంటి సినిమాలకి వేగం అవసరం. ఆ వేగం కాస్త లోపించింది. స్క్రీన్‌ప్లే పరంగా అక్కడక్కడా హిక్కప్స్‌ కన్పిస్తాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అన్పిస్తుంది. సంగీతం ఓకే. బ్యాక్‌రగౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ ఓకే. నిర్మాణపు విలువలు ఓకే.

రీమేక్‌ సినిమా చేస్తున్నప్పుడు నేటివిటీ సహా, అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి వుంటుంది. మైనస్‌లను సరిచేసుకోవాల్సి వున్నా, ఆ దిశగా కసరత్తులు చేసినట్లు కన్పించదు. సినిమాలో ప్రధానంగా వేగం లోపించింది. దాంతో, బోరింగ్‌గా అన్పిస్తుంటుంది. 'టెంపో' కూడా పెద్దగా కన్పించదు. క్లయిమాక్స్‌ సినిమాలు ఓకే. ఫస్టాఫ్‌ సహనాన్ని పరీక్షిస్తుంది. ఓవరాల్‌గా సినిమా నిరాశపరుస్తుందని చెప్పక తప్పదు.

ఒక్క మాటలో చెప్పాలంటే

నీవెవరో - నిరాశర్చింది

అంకెల్లో చెప్పాలంటే: 2.2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
churaka