అంజలి, శ్రీ విద్య, బిందు మాధవి తదితర తెలుగమ్మాయిలు ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. తెలుగమ్మాయిలకు తెలుగులో ఆదరణ తక్కువైనా, ఇతర భాషల్లో స్టార్‌డమ్ సంపాదించుకోవడం ఎప్పటి నుండో పరిపాటిగానే ఉంది. తాజాగా మరో పదహారణాల తెలుగమ్మాయి కన్నడలో సత్తా చాటేందుకు సిద్ధపడుతోంది. ఆమె మరెవరో కాదు ఈషా రెబ్బ. 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, 'అమీ తుమీ'తో పాపులర్ అయ్యి, నాని సమర్పణలో వచ్చిన 'అ'లో విలక్షణ క్యారెక్టర్ పోషించింది.
ప్రస్తుతం స్టార్ హీరో తారక్‌తో 'అరవింద సమేత'లో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ఈ ముద్దుగుమ్మని వరించింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈషా రెబ్బ. లక్కీ గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఈషా ఓ కాలేజ్ ప్రొఫిసర్ పాత్రలో నటించనుందనీ సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఏది ఏమైనా ఎంట్రీ తోనే ఇలాంటి బంపర్ ఆఫర్ కొట్టిందంటే ఈషా మామూలుదేం కాదండోయ్. అందుకే అంచెలంచెలుగా తన కెరీర్‌ని బిల్డప్ చేసుకుంటూ వస్తోన్న మన తెలుగమ్మాయి సినీ ప్రయాణం మరింత దూరం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని ఆశిద్దాం.
|