'ఒకే తల్లి కడుపున ఒకే రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు.. ఒకే శరీరం ఒకే రక్తం పంచుకుని పుడితే అదో అద్భుతం. ఆ అద్భుతానికి అంకురాన్ని నేను..' అంటున్నాడు నాగచైతన్య. చైతూ హీరోగా నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం టీజర్ బయటికి వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. విలక్షణ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కథ, కథనాలు చాలా కొత్తగా ఉండేలా కనిపిస్తోంది టీజర్ చూస్తుంటే. 'సవ్యసాచి' అంటే రెండు చేతులనూ సమానంగా ఉపయోగించగలిగిన వాడు అని అర్ధం. అయితే ఈ సినిమాలో 'సవ్యసాచి' కొంచెం డిఫరెంట్. ఎడమ చేయికి సూపర్ నేచురల్ పవర్ ఉంటుంది.
ఆయనకి తెలీకుండానే తన చేయి పని చేసేస్తూ ఉంటుంది. సినిమాకి టైటిల్ అనుకున్నాకే ఇదో కొత్త కాన్సెప్ట్ మూవీ అనుకున్నారు. ఇక టీజర్ వచ్చాక సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఆసక్తికరమైన అంశాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు ఈ సినిమాలో ఉండనున్నాయట. తమిళ హీరో మాధవన్ ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు లోకి తెరంగేట్రం చేస్తున్నాడు. అది కూడా ఓ విలక్షణ పాత్ర పోషిస్తున్నాడు. టీజర్‌లో మాధవన్ ఎంట్రీ బాగుంది. రావణునితో పోలుస్తూ ఆయన ఎంట్రీ చూపించారు. అంటే మాధవన్ ఈ సినిమాకి విలన్ అని కన్‌ఫర్మ్ అయిపోయింది. సీనియర్ హీరోయిన్ భూమిక మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో కొత్త భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.
|