అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ ఈ మధ్యనే 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. కన్నడలో ఘన విజయం సాధించిన 'సైరత్' మూవీకి రీమేక్‌గా రూపొందిన ఆ సినిమాలో జాన్వీ నటనకు అంతా ఫిదా అయిపోయారు. తొలి సినిమా అనే బెరుకు ఎక్కడా కనిపించకుండా, ఎన్నో సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న నటిలా నటించింది. అందుకే విమర్శకులు సైతం ఆమెను ప్రశంసించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. 100 కోట్ల క్లబ్‌లో నిలిచింది. ప్రస్తుతం జాన్వీ రెండో సినిమా కూడా కన్‌ఫామ్ అయ్యింది. 'తఖ్త్' అనే పీరియాడిక్ మూవీలో జాన్వీకపూర్ నటిస్తోంది. తొలి సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన కరణ్ జోహార్ నిర్మాణంలోనే ఈ చిత్రం కూడా రూపొందుతోంది.
అయితే జాన్వీకపూర్ తల్లి శ్రీదేవి లాగే భాషతో సంబంధం లేకుండా సౌత్ సినిమాల్లో కూడా నటిస్తుందనీ, అందులో భాగంగానే తెలుగులో ఓ సినిమాకి కమిట్ అయ్యిందనీ, ఆల్రెడీ తమిళంలో ఓ సినిమాకి సైన్ చేసిందనీ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదనీ జాన్వీ తాజాగా స్పష్టం చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల పైనే తాను పూర్తిగా దృష్టి పెట్టాననీ, సౌత్ సినిమాల్లో నటించేందుకు మరికొంత టైం పడుతుందనీ ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదనీ తేల్చేసింది. ఈ న్యూస్‌తో తెలుగు ప్రేక్షకులు కాస్త నిరాశ పడినా, ఎప్పటికో అప్పటికి అతిలోక సుందరి కూతురుని తమ సినిమాల్లో చూడలేకపోతామా? అనే నమ్మకంతో ఉన్నారు. మరి జాన్వీ ఏం చేస్తుందో మున్ముందు చూడాలిక.
|