ఎన్టీఆర్ మంచి నటుడే కాదు, మంచి వక్త కూడా. ఇంత వరకూ ఎన్నో ఆడియో వేదికలపై తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అభిమానుల్నిల అలరించిన ఎన్టీఆర్ తొలిసారిగా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి తాను కన్నీళ్లు పెట్టుకోవడమే కాక, అభిమానుల గుండెల్ని కూడా బరువెక్కించేశాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం 'అరవింద సమేత..' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఎన్టీఆర్ కన్నీటి ప్రసంగానికి అభిమానులు తట్టుకోలేకపోయారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణానంతరం ఎన్టీఆర్ పాల్గొన్న మొట్ట మొదటి సినిమా ఫంక్షన్ ఇదే. ఈ వేడుకలో ఎన్టీఆర్ తన తండ్రిని తల్చుకుని కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు.
ఒక్క షాట్‌లో కూడా ఆయన చిరునవ్వు చిందించిందే లేదు. ఇక సినిమా విషయానికి వస్తే, మనిషిని మనిషిగా మార్చగలిగే చిత్రమిది అని ఎన్టీఆర్ అన్నారు. మనిషి ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. ఆ మనిషి మన మధ్య లేనప్పుడే విలువ తెలుస్తుంది.. అంటూ మనిషి మనిషిగా ఎలా బతకాలో తెలియజెప్పే సినిమా 'అరవింద సమేత' అని ఎన్టీఆర్ సభాముఖంగా వెల్లడించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ చూస్తే, కొంచెం లవబుల్, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్, కొంచెం యాక్షన్, కొంచెం ఎమోషన్ ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్ మిక్స్‌లా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌కి 28వ చిత్రమిది. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|