Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

అసూయతో ప్రేరణ పొందడం తప్పా - ..

Is it wrong to get inspired by jealousy

అదృష్టం కొద్దీ, ఈరోజుల్లో ఇది లేదు. నా చిన్నప్పుడు, ముఖ్యంగా దీపావళి సమయంలో, చిన్న ఊళ్లలో సరదాకోసం కొంతమంది ఒక డబ్బానిండా టపాసులను తీసుకుని గాడిద తోకకు కట్టేవారు. టపాసులు పేలగానే, పాపం ఆ గాడిద గుర్రం కంటే వేగంగా ఇష్టమొచ్చినట్టు పరిగెత్తేది. జీవితంలో ప్రేరణ ఇలా ఉండాలంటారా? అనుకున్నవి సాధించటానికి ఎన్నో తెలివైన మార్గాలునాయి.

తోక కాలితే పరిగెడతారన్నది నిజమే. ప్రజల్లో ఉన్న ఒక సామెత ఏమిటంటే, కుక్క మిమ్మల్ని తరిమితే, మీరు వేగంగా పరిగెడతారు. కానీ ఉస్సేన్ బోల్ట్, తన తోకకు నిప్పంటిందని పరిగెట్టలేదు. తన కాళ్ళని, ఊపిరితిత్తులని ఎలా సిద్ధం చేసుకున్నాడంటే, అతను ఎలా పరిగెత్తినా అందరికంటే వేగంగా పరేగెత్తేలా చేసుకున్నాడు. ఇది కదా పరిగెత్తడమంటే? ఒక కుక్క మిమ్మల్ని తరుముతుందనో, మీ తోకకు నిప్పంటిందనో మీరు పరిగెత్తాలనుకుంటారా? అటువంటి పరుగుకు అర్థం లేదు.

ఒక కుక్క మిమ్మల్ని తరుముతుందనో, మీ తోకకు నిప్పంటిందనో మీరు పరిగెత్తాలనుకుంటారా? అటువంటి పరుగుకు అర్థం లేదు.

మీరు పరిగెత్తాలనుకోవటం ముఖ్యమే, కానీ మరొక విషయమేమిటంటే, మీకు ఈ పరిగెత్తడమనేది ఎంతో పరమానందంగా అనిపించాలి. అది కూడా ముఖ్యమే కదా? మీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అయ్యారు, కానీ అది మూడేళ్ళ నరకం కావచ్చు కదా? ఈ మూడేళ్ళు మీకు అధ్బుతమైన అనుభవాన్ని ఇవ్వటం ముఖ్యం కదా? పరిగెత్తటం ఒకటే ముఖ్యం కాదు. అది మీకు ఎటువంటి అనుభవాల్ని ఇచ్చింది, రేపు దానినుంచి ఏమి జరగబోతున్నదన్నది కూడా ఎంతో ముఖ్యం. .

ఒకవేళ మీ తోకకు నిప్పంటుకుంది కాబట్టి మీరు పరిగెడితే, రేపు ఏదన్నా జరగాలంటే జనాల తోకలకు నిప్పు పెట్టడమే సరైనదని మీరు అనుకుంటారు. దీనివలన అందరికీ ఎంతో నష్టం జరుగుతుంది.

భయంతో ఇలా గుర్రాలకంటే వేగంగా పరిగెత్తే గాడిదలను నేను చూసాను. ఇలా పరిగెట్టడం సరి కాదు, ఇంకెప్పుడూ మీరు ఇలా చేయకండి.

భయంతో ఇలా గుర్రాలకంటే వేగంగా పరిగెత్తే గాడిదలను నేను చూసాను. ఇలా పరిగెట్టడం సరి కాదు, ఇంకెప్పుడూ మీరు అలా చేయకండి.

ఇషా ఫౌండేషన్ సౌజన్యం తో...

మరిన్ని శీర్షికలు
atmashaktulu