కావలిసిన పదార్ధాలు:
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, క్యాప్సికం, రొయ్యలు, పసుపు, నూనె, కారం, ఉప్పు, కొత్తిమీర, టమాట, కొబ్బరిపాలు, నిమ్మకాయ.
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద క్యాప్సికం, టమాట వేసి బాగాకలిపి 10 నిముషాలు మూతపెట్టి వుంచాలి. ఈ మిశ్రమం మగ్గిన తరువాత అందులో రొయ్యలను వేసి కలిపి మూతపెట్టాలి.
ఈ మిశ్రమం ఉడికిన తరువాత అందులో కొబ్బరి పాలు పోసి కలిపి తరువాత కొత్తిమీర వేసి , నిమ్మకాయ రసం కొద్దిగా వేయాలి. అంతే వేడి వేడి క్యాప్సికం రొయ్యలు రెడీ...!!
|