గోతెలుగు సమర్పణలో రూపొందుతున్న లేడీస్ అండ్ జెంటిల్ మెన్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అక్టోబర్ 21న మొదలైన ఈ సినిమా షూటింగ్ 30 రోజుల్లో పూర్తయిపోనుందట. నిర్ణీత కాలంలో సినిమాని పూర్తి చేసేలా పూర్తి అవగాహనతో సినిమా రూపొందిస్తున్నారు. మధుర శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై లేడీస్ అండ్ జెంటిల్ మెన్ తెరకెక్కుతోంది.
మహత్ రాఘవేంద్ర, అడవి శేష్ , కమల్ కామరాజు, స్నేహగీతం చైతన్య ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సిరాశ్రీ సాహిత్యం అందిస్తున్నారు. ఓ సరికొత్త కథాంశంతో సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు మంజునాథ్ . ఇంటర్నెట్ మీడియా వల్ల జరిగే అనర్థాల గురించి సినిమాలో చర్చిస్తున్నారట. యూత్ ని ఆకట్టుకునేలా, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా వుంటుందట. తెలుగు తెరపై ఇది ఒక సరికొత్త చిత్రం అవుతుందని చిత్ర దర్శక నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు.
|