మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈవారం మొత్తం మీద మొండి నిర్ణయాలు తీసుకొవడం వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారీ. బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ముఖ్యమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. మానసికంగా దృడంగా ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, స్రదుబాటు విధానం మంచిది . రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈవారం మొత్తం మీద పెద్దలను కలుస్తారు, మీ నిర్ణయాన్ని వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటారు. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆరంభంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును, చేపట్టు పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈమాత్రం అశ్రద్ద పనికిరాదు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. బంధువులతో సమయం గడుపుతారు. చర్చలకు దూరంగా ఉండుట సూచన.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం మొత్తం మీద ఆరంభంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. తలపెట్టిన పనులను నలుగురి సహకారంతో పూర్తిచేస్తారు. చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. అధికారులతో మీ ఆలోచనలు వారితో పంచుకుంటారు, వారితో మాటపట్టింపులకు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ఆత్మీయులను కలుస్తారు , వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, తోటివారిని కలుపుకొని వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. చర్చల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతారు. సంతానం నుండి ముఖ్యమైన సూచనలు వస్తాయి. పెద్దలతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాల్లో తడబాటు పొందుతారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబుడులు ఆశించిన మేర లభిస్తాయి. సోదరులతో చేపట్టిన చర్చలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తాయి. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం మొత్తం మీద విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన, కొనుగోలు చేయాలనే ఆలోచన చేయకండి. బంధువులతో కలిసి శుభకార్యక్రమాల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. సోదరులతో మీ అలోచనలు పంచుకొనే అవకాశం ఉంది.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈవారం మొత్తం మీద మాట్లాడే మాటల విషయంలో స్పష్టత అవసరం. గతంలో చేపట్టిన పనులకు కట్టుబడి ఉండుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులతో సమయం సరదాగా గడుపుతారు. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో బాగానే ఉంటుంది. పెద్దల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల నుండి ముఖ్యమైన సూచనలు వింటారు. విలువైన వస్తువులకు ధనం వెచ్చిస్తారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగంలో బాగాఉంటుంది, అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచిస్తాయి. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. బంధువులను కలుస్తారు, వారితో కలిసి వినోద భరితమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం వలన సంతోషాన్ని పొందుతారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్న మిత్రులతో మీ ఆలోచనలు పాల్గొంటారు. చర్చల్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుతారు.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈవారం మొత్తం మీద ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో నూతన నిర్ణయాలకు ప్రధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ఇబ్బందులు తప్పక పోవచ్చును. బంధువులతో విబేధాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి, సర్దుబాటు విధానం మంచిది. ఆరోగ్యం విషయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈవారం మొత్తం మీద ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. సంతానం వలన నలుగురిలో గుర్తిపును పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మీకు నచ్చిన వ్యక్తులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత అవసరం.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. సామాజిక కార్యక్రమాల పట్ల మక్కువను చూపిస్తారు. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, సాధ్యమైనంత మేర వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యహరించుట సూచన. వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. మానసికంగా దృడంగా ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది.
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవజ్ఞుల సూచనలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
|