టపాసులు ఢాం అని పేలుతాయి. చెవులు చిల్లు లవుతాయి. మతాబాలు, చిచ్చు బుడ్లూ కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వెలుగుతాయి. చివరికి పొగలు చుట్టి వూపిరాడకుండా చేస్తాయి. పండగ ఎంత బాగా సాగినా , మిగిలేది వాతావరణ కాలుష్యమే , చిత్తు కాగితాలు నిండిన వీధులే. వెరసి ,ఆరొగ్యానికి టపాసుల పండగ పెద్ద ముప్పే.
ప్రస్తుతం ,ఎలక్షన్ లు పెనుభూతాల్లా ప్రజల మీదికి దూకనున్నాయి. ప్రజానాయకులు కొందరు టపాసుల్లా పేలుతున్నారు. మేనిఫెస్టోలు గుప్పిస్తున్నారు. సామాన్య మానవుడి బుర్రని కాలుస్తున్నారు.టపాసులన్నీ పేలవు. కొన్ని తుస్సుమంటాయి. మరికొన్ని ఎంత నిప్పంటించినా రగులుకోవు. ఈ నాయకులూ అంతే.
టపాసులూ , ఎలక్షన్లూ కలిపి అయిడియాలు ఆలోచించి కార్టూన్లు గీయమన్నాను మన తెలుగు కార్టూనిస్టులని. వారి స్పందన గోతెలుగు పాఠకులకి దీపావళీ శుభాకాంక్షలతో సమర్పిస్తున్నాను.
కార్టునిస్ట్ జయదేవ్
|