కావలసిన పదార్థాలు :
రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా చింతపండు, మసాలాపొడి, నూనె, ఉప్పు, కారం
తయారు చేయు విధానం :
ముందుగా బాణీలో నూనె వేడిచేసుకొని ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దానిలో వేసి బాగామగ్గనివ్వాలి. తరువాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పాలి. తరువాత దానిలో రొయ్యలు వెయ్యాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి తిప్పాలి. దీనిని చక్కగా మూతపెట్టి పది నిమిషాలు మగ్గనిస్తే నీళ్ళు వస్తాయి. ఇంక దీనిలో నీళ్ళు అవసరం లేదు. కొంచెం చింతపండు రసం వేయాలి. ఈ నీరంతా పోయేవరకు మూతపెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత కొంచెం మసాలాపొడి వేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర చల్లి సర్వింగ్ బోల్ లోకి తీసుకుంటే ఆంధ్రా రొయ్యల కూర రెడీ.
|