అప్పుడెప్పుడో కమల్ హాసన్ 'మరుగుజ్జు' పాత్రలో నటించాడు. మళ్లీ ఇప్పుడు షారూఖ్ ఖాన్ అలా మరుగుజ్జు పాత్రలో సందడి చేయబోతున్న సినిమా 'జీరో'. తాజాగా ట్రైలర్ విడుదలైంది. మనిషి పొట్టోడే కానీ, చాలా గట్టోడు. ట్రైలర్‌లో మరుగుజ్జుగా షారూఖ్ ఖాన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. భలే ఎట్రాక్ట్ చేసేస్తున్నాడు. ఫన్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోన్న ప్రయోగాత్మక చిత్రం 'జీరో'. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీల్ ఛైర్‌కి పరిమితమైన హ్యాండి క్యాప్డ్ యువతి పాత్రలో అనుష్క నటిస్తోంది.
రియల్ లైఫ్ అందమైన హీరోయిన్ పాత్రను కత్రినా కైఫ్ పోషిస్తోంది. పొడుగాటి అందాల సుందరి కత్రినాతో మరుగుజ్జు షారూఖ్ ఖాన్ లిప్ లాక్ సీన్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. మరుగుజ్జు పాత్రలో షారూఖ్ తెగ నచ్చేస్తున్నాడు అందరికీ. అందుకే ఈ ట్రైలర్‌కి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. డిసెంర్‌లో 'జీరో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత వరకూ చాలా సినిమాల్లో మరుగుజ్జు పాత్రలు చూశాం కానీ, అవన్నీ ఏదో కొన్ని నిమిషాల పాటు మాత్రమే కథలో మిళితమై ఉన్నాయి. కానీ కమల్ హాసన్ తర్వాత పూర్తి స్థాయి మరుగుజ్జు పాత్రలో కనిపిస్తోంది మాత్రం షారూఖ్ అనే చెప్పాలి. ట్రైలర్ తోనే ఇంత రెస్పాన్స్ సంపాదించేసిన బాద్‌షా ఇక సినిమాతో రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
|