మెగా వపర్‌స్టార్ రామ్‌చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న మెగా మల్టీ స్టారర్ 'ఆర్‌ఆర్‌ఆర్' పట్టాలెక్కేందుకు సుముహూర్తం కుదిరింది. నవంబర్ 11న ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించేందుకు జక్కన్న రాజమౌళి రంగం సిద్ధం చేసేశారు. నవంబర్ 11 ఉదయం 11 గంటలకు ఈ చిత్రం ప్రారంభోత్సవం జరగనుంది. 'ఆర్.ఆర్.ఆర్' కోసం '11.11.11' డేట్‌ని సిద్ధం చేశాడన్న మాట జక్కన్న. జక్కన్న ఏం చేసినా అంతే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండి తీరాల్సిందే. అంతే కాదు ఆ రోజు సినిమాకి సంబంధించిన మరో సర్‌ప్రైజ్‌ని రివీల్ చేయ బోతున్నాడట రాజమౌళి. ఈ సినిమాకి స్పెషల్ చీఫ్ గెస్ట్ రానున్నాడట. మెగస్టార్ చిరంజీవి పేరు, ప్రబాస్ పేరు ఆ లిస్టులో ఉంది.
కాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ పేర్లు కూడా ఇంత వరకూ అఫీషియల్‌గా రివీల్ కాలేదు. అదే రోజు ఆ విషయం కూడా రివీల్ చేసి రాజమౌళి సరి కొత్త సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడనీ మరో టాక్. రాజమౌళి ఏం చేసినా చెప్పే చేస్తాడు. అయితే కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తాడంతే. అన్ని రకాల సస్పెన్స్‌లకు నవంబర్ 11 ఉదయం 11 గంటల తర్వాత శుభం కార్డు పడిపోనుందట. ఇక పోతే ఈ కథలో చరణ్, ఎన్టీఆర్‌లు తమ పాత్రలకు అనుగుణంగా తమ తమ ఫిట్‌నెస్‌ని బిల్డప్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. 'అరవింద సమేత..' నుండి రిలాక్స్ అయి పోయిన ఎన్టీఆర్ ఆల్రెడీ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేశాడు. ఇక త్వరలోనే చరణ్ కూడా జాయిన్ అయి పోతాడు. డివివి ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
|