ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అదరహో అనిపించిన విజువల్ వండర్ 'రోబో'. పిల్లల్నీ, పెద్దల్నీ అందర్నీ 'రోబో' సినిమా మైమరిపించేలా చేసింది. చిట్టి రోబో అందరికీ ఎంతగానో దగ్గరై పోయాడు ఆ సినిమాతో. సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత కళా ఖండం అది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'రోబో 2.0'. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.
దుబాయ్‌లో కనీ వినీ ఎరుగని రీతిలో 'రోబో 2.0' ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి రికార్డు వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా 'రోబో 2.0' ట్రైలర్ విడుదలైంది. అంచనాలను అందుకుందా.? లేదా.? అనే విషయం అటుంచితే 'రోబో'ని మించిన విజువల్ ఎఫెక్ట్స్, రిచ్ అప్పియరెన్స్ ఈ సీక్వెల్‌లో ఉన్నట్లే కనిపిస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది. ఆయన గెటప్ ముఖ్యంగా హైలైట్ అవుతోంది. ట్రైలర్ లో కూడా రోబోగా నటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్రలో పెద్దగా కొత్తదనమేమీ కనిపించక పోయినా, ఓ భయంకరమైన పక్షిని పోలిన విలన్ పాత్ర డిజైన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అలాగే హీరోయిన్‌గా అమీ జాక్సన్ ట్రైలర్‌లో లేడీ రోబోగా కనిపించింది. మొదటి పార్ట్‌లో నటించిన ఐశ్వర్యా రాయ్ అంత గ్లామర్‌గా అమీ జాక్సన్‌ని ట్రైలర్‌లో చూపించ లేదు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. నవంబర్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|