Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chitti robo coming...!

ఈ సంచికలో >> సినిమా >>

విజయ్‌ దేవరకొండ 'ట్యాక్సీ' లేటయ్యింది కానీ.!

vijay devarakonda taxi late but...

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'ట్యాక్సీ వాలా' ఎప్పుడో విడుదల కావల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. నవంబర్‌ 16న 'ట్యాక్సీవాలా' రిలీజ్‌ అంటూ ఇటీవల విజయ్‌ దేవరకొండ అఫీషియల్‌ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ డేట్‌లో కొద్దిగా మార్పు జరిగింది. ట్యాక్సీవాలా వచ్చేది నవంబర్‌ 16 కాదు 17 అంటూ లేటెస్టుగా మరో ప్రకటన రిలీజ్‌ చేశాడు విజయ్‌ దేవరకొండ.

ఎందుకో ఆ డేట్‌కి విజయ్‌ దేవరకొండ ఆడ్జస్ట్‌ కాలేక పోతున్నాడట. దాంతో 17కు 'ట్యాక్సీవాలా'ని షిఫ్ట్‌ చేశాడు. వాస్తవానికి 16న రవితేజ నటిస్తున్న 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' విడుదల కానుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఇంట్రెస్టింగ్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. రవితేజ త్రిపాత్రాభినయంతో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ క్రియేట్‌ చేసిన ఆసక్తితో విజయ్‌ దేవరకొండ వెనక్కి తగ్గాడో ఏమో కానీ, సడెన్‌గా డేట్‌ ఛేంజ్‌ చేసి, ఈ యంగ్‌ హీరో చిన్న షాక్‌ ఇచ్చాడు. మరో వైపు 'ట్యాక్సీవాలా' ప్రమోషన్స్‌తో సోషల్‌ మీడియా దద్దరిల్లి పోతోంది. విజయ్‌ దేవరకొండ 'రౌడీస్‌' (అభిమానులు) సోషల్‌ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన విజయ్‌ 'నోటా'తో కాస్త డీలా పడ్డాడు. కానీ 'ట్యాక్సీవాలా'తో మళ్లీ పరుగు మొదలు పెట్ట బోతున్నాడట. ప్రియాంకా జవాల్కర్‌ ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా నటిస్తోంది.

 

మరిన్ని సినిమా కబుర్లు
rajamouli multi starer