Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'చిట్టి' సెన్సేషన్‌ మొదలైపోయింది.!

chitti sensation start

గతంలో 'చిట్టి'గా వచ్చి రికార్డులు కొల్లగొట్టిన 'రోబో' సినిమాకి సీక్వెల్‌గా వస్తోన్న '2.0' విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న 'రోబో 2.0' కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయిపోయింది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలున్నాయి. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ అద్భుత విజువల్‌ని చూసేందుకు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా, సూపర్‌ స్టార్‌ సినిమాలకు వరల్డ్‌ వైడ్‌గా క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా రిలీజ్‌ డేని కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు సెలవు దినంగా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. వినూత్న ఆలోచనలతో ఇంకా ఇంకా భారీ ఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహించనున్నారట. రోజుకో ఇంట్రెస్టింగ్‌ పోస్టర్‌ చొప్పున విడుదల చేస్తూనే ఉంది చిత్రయూనిట్‌. ఆల్రెడీ విడుదలైన టీజర్‌, ట్రైలర్స్‌ ఏజ్‌ యూజ్‌వల్‌ రికార్డులు కొల్లగొడుతూనే ఉన్నాయ్‌. అమీజాక్సన్‌ లేడీ రోబోగా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అక్షయ్‌ కుమార్‌ తన పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో పలు ఇంటర్వ్యూస్‌లో చెబుతూనే ఉన్నారు. హీరోయిన్‌ మేకప్‌ కన్నా తనకే ఎక్కువ మేకప్‌ వేసేవారట. అంత క్రిటికల్‌ మేకప్‌లో ఆ పాత్రలో ఉన్నది అక్షయ్‌ అనే విషయమే గుర్తు లేనంతగా డిజైన్‌ చేశారు శంకర్‌. అలా సూపర్‌ స్టార్‌కి పోటీ ఓ వైపు, ఇంతవరకూ తాను పోషించని క్రిటికల్‌ అండ్‌ చాలెంజింగ్‌ రోల్‌ మరోవైపు.. అన్నీ వెరసి సినిమాలో అక్షయ్‌ పర్‌ఫామెన్స్‌ ఎలా ఉందనేది తెలియాలంటే ఎన్నో రోజులు కాదు జస్ట్‌ కొన్ని రోజులు మాత్రమే వెయిట్‌ చేయాల్సి ఉంది.

మరిన్ని సినిమా కబుర్లు
churaka