ఒక్క పిక్‌తో సెన్సేషన్ సృష్టించేశారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, జక్కన్న రాజమౌళి. ఈ ముగ్గురూ ఆప్యాయంగా దిగిన ఫోటో పోస్ట్‌తోనే 'ఆర్‌ఆర్‌ఆర్'కి బీజం పడింది. పిక్ చూసి అభిమానుల గెస్ చేసిందే కరెక్ట్ అయ్యింది. ఫ్యాన్స్‌ని ఎక్కువగా ఎదురు చూడనీయకుండా, రాజమౌళి నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే సినిమా సెట్స్ మీదికెళ్లిపోయింది. ఈ నెల 11న సినిమాని ఆర్భాటంగా ఆరంభించేశారు. అంతకు ముందే ఏర్పాటు చేసిన ఓ భారీ సెట్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' రెగ్యులర్ షూటింగ్ ఘనంగా స్టార్ట్ అయ్యింది. తొలిరోజు షూటింగ్ స్పాట్ నుండి విడుదలైన ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఫోటో మళ్లీ నెట్టింట్లో వైరల్ అయ్యింది. సేమ్ పోజు. కానీ సెట్ మారిందంతే. ఇంకేముంది ఆ పిక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
ఇక సినిమా విషయానికి వస్తే, రాజమౌళి సినిమా అంటే కథా కమామిషు ఇలా ఉండబోతుంది అంటూ ముందే హింట్ ఇచ్చేస్తుంటాడు. కానీ 'ఆర్‌ఆర్‌ఆర్' విషయంలో జక్కన్న ఎందుకో కాస్త గోప్యత పాఠిస్తున్నాడు. చరణ్, ఎన్టీఆర్‌ల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే హీరోయిన్స్ విషయం కూడా ఇంకా రివీల్ కాలేదు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాని డి.వి.వి.దానయ్య ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
|