అడల్ట్ కంటెన్ట్ సినిమాలతో భాషతో సంబంధం లేకుండా, సెన్సేషన్ సృష్టించిన షకీలా బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'సి' గ్రేడ్ సెక్సువల్ కంటెన్ట్‌తో రికార్డు వసూళ్లు కొల్లగొట్టిన షకీలా జీవితంలో జనానికి తెలియని ఎన్నో చీకటి కోణాలున్నాయి. ఆ చీకటి కోణాలను ఈ బయోపిక్ ద్వారా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది చిత్ర యూనిట్. కాగా వెరీ లేటెస్టుగా ఈ బయోపిక్ కి సంబంధించి ఫస్ట్‌లుక్ వదిలారు. ఫస్ట్‌లుక్‌తోనే బోలెడన్ని మార్కులు కొట్టేశారు. 'నీ ఇల్లు బంగారం కానూ..' అనే మాట.. పాట తెలుసు కానీ, ఇలా బట్టలే లేకుండా ఒళ్లంతా బంగారమాయె.. అనే మాట ఇప్పుడే వినాలి మరి. అవును షకీలా ఫస్ట్‌లుక్‌ని ఇలాగే డిజైన్ చేశారు. ఫుల్ న్యూడ్ బాడీని ఫుల్‌గా బంగారు నగలతో కప్పేశారు. ఇదే షకీలా సినిమా ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు.
రిచా చద్దా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. కాగా ఇప్పుడీ సినిమా మలయాళ సినీ జనంలో అనూహ్యమైన ఉత్కంఠ నెలకొల్పుతోంది. మలయాళ సినీ పరిశ్రమతోనే ఎక్కువగా షకీలా సినిమాలకు దగ్గర సంబంధం ఉంది. అప్పట్లో షకీలా సినిమాలు మలయాళ సూపర్‌స్టార్‌ల సినిమాలను కూడా గండికొట్టేసిన సందర్భాలున్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో షకీలా చాలా దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పట్లో. తెర వెనక జరిగిన ఈ చీకటి కోణాల్ని సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారనీ సమాచారమ్. వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'షకీలా' బయోపిక్ వివాదాలకు నెలవవుతుందో, లేక రికార్డులే కొల్లగొడుతుందో చూడాలిక.
|