Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
husharu movie review

ఈ సంచికలో >> సినిమా >>

సంక్రాంతి అల్లుళ్లు పక్కా నవ్వించేస్తారు 'అంతేగా.'!

sankranti son in law's

సంక్రాంతి పండగ ముందే వచ్చేసిట్లైంది. 'ఎఫ్‌ 2' టీజర్‌ చూశాక. అవునండీ ఇది నిజం. టీజర్‌ అంత కన్నుల పండగలా అనిపించింది. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ ఇద్దరూ ఇద్దరే. పోటా పోటీగా నవ్వించేస్తునారు. కేవలం 1 నిముషం 20 సెకన్ల పాటున్న ఈ కొద్దిపాటి టీజర్‌తోనే భలే ఆకట్టేసుకున్నారీ తోడల్లుళ్లిద్దరూ. అదేనండీ వెంకీ, వరుణ్‌ ఈ సినిమాలో తోడల్లుళ్లుగా నటిస్తున్నారులెండి. తమన్నా, మెహ్రీన్‌ వీరిద్దరికీ భార్యల పాత్రలు పోషిస్తున్నారన్న మాట. పెళ్లికి ముందు పెళ్లాన్ని ఎలా డీల్‌ చేయాలో నాకు బాగా తెలుసంటే, నాకు బాగా తెలుసని ఈ ఇద్దరూ కోతలు కోసినవాళ్లే. అయితే పెళ్లయ్యాక కదా ఓ మగాడి జీవితం ఎలా ఉంటుందనేది తెలిసింది వీళ్లిద్దరికీ. అందలోంచే విపరీతమైన ఫ్రస్టేషన్‌ పుట్టుకొచ్చింది.

వారి ఫ్రస్టేషనే మనకు వినోదం పుట్టించేది. సో టైటిల్‌కి ఫుల్‌ యాప్ట్‌గా వీరి క్యారెక్టర్లు, కథా, కథనాల్ని జాగ్రత్తగా డీల్‌ చేసినట్లున్నాడు డైరెక్టర్‌. అందుకే ఇంత చక్కగా టీజర్‌ని కట్‌ చేశాడు. మొత్తానికి 'ఎఫ్‌ 2' టీజర్‌ బాగా కనెక్ట్‌ అవుతోంది ప్రతీ మగాడి జీవితానికి. అలాగే పెళ్లాలకు కూడాలెండి. అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి చాలా కాలం తర్వాత సంక్రాంతికి అసలు సిసలు పండగలాంటి సినిమాగా 'ఎఫ్‌ 2'ని తీర్చి దిద్దాడు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి మరో ప్లస్‌ పాయింట్‌ కానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
fix