Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Shriya Fixed

ఈ సంచికలో >> సినిమా >>

విజ్ఞత పాటించిన తెలుగు సినీ పరిశ్రమ

Film industry

తెలుగు సినీ పరిశ్రమకు కేసీఆర్‌పై ఉన్న అపారమైన అభిమానాన్ని ఇలా తెలియపర్చారు. తాజాగా జరిగిన తెలంగాణా ఎలక్షన్స్‌ పోరులో కేసీఆర్‌ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నుండి ఒక్కొక్కరుగా కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణాలో తెలుగు సినీ పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. ముందుగా సూపర్‌స్టార్‌ కృష్ణ, కేసీఆర్‌కు కంగ్రాట్స్‌ తెలియజేయగా, తర్వాత ఒక్కొక్కరుగా క్యూ కట్టారు. కేసీఆర్‌ గ్రేట్‌ అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, మోహన్‌బాబు, మంచు మనోజ్‌, నాని, రామ్‌గోపాల్‌ వర్మ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ తదితరులతో పాటు మూవీ అసోసియేషన్‌ తరపున 'మా' సభ్యులు కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే ఎలక్షన్స్‌ టైంలో సీనియర్‌ నటులు ప్రకాష్‌ రాజ్‌, సుమన్‌ తమ అభిప్రాయాల్ని తెలియజేశారు. చంద్రబాబుకు తెలంగాణాలో ఏం పని.? అని ప్రకాష్‌రాజ్‌ ఓపెన్‌గా ప్రశ్నించారు. మరో నటుడు సుమన్‌ అయితే తెలంగాణాలో కేసీఆర్‌ విజయం సాధించాలి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు మద్దతిస్తానని అన్నారు. బాలకృష్ణ, తారకరత్న నందమూరి ఫ్యామిలీ నుండి టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొనగా, కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ మాత్రం ఆ ఛాయలకే పోలేదు. కాంగ్రెస్‌, టీడీపీకి ప్రచారంలో ఎంతగా సినీ గ్లామర్‌ యాడ్‌ అయినా చివరికి కారు జోరును ఆపడం సాధ్యం కాలేదు. భారీ మెజార్టీతో తెలంగాణాలో మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎన్నికయ్యారు. దాంతో సినీలోకం కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపి తమ విజ్ఞతను చాటుకుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam