Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Tension increases

ఈ సంచికలో >> సినిమా >>

చైతూకి అత్తగా శ్రియ ఫిక్సయ్యిందా.

Shriya Fixed

ఓ పక్క గ్లామర్‌ పాత్రలతో మెప్పిస్తూనే హుందా అయిన పాత్రల్నీ ఎంచుకుంటోంది ముద్దుగుమ్మ శ్రియ. తాజాగా విక్టరీ వెంకటేష్‌, నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీ స్టారర్‌ మూవీకి శ్రియ పేరును పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ పేరు దాదాపు ఖరారైనట్లే అని విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. గతంలో వెంకీ, శ్రియ కలిసి రెండు సినిమాల్లో నటించారు. ముచ్చటగా మూడోసారి జత కట్టబోతున్న ఈ సినిమాలో శ్రియ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. కథ పరంగా వెంకీ, చైతూ మేనమామ, మేనల్లుడిగా నటిస్తున్నారు. అంటే శ్రియ చైతూకి అత్త పాత్ర పోషించాల్సి ఉంటుంది.

ఈ పాత్ర పోషించడం పట్ల శ్రియ కూడా ఆశక్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ హీరోలతోనూ, జూనియర్‌ హీరోలతోనూ గ్లామర్‌ పాత్రల్లో నటించి మెప్పించిన శ్రియకు ఈ పాత్ర కాస్త సవాల్‌తో కూడుకున్నదిగానే భావించాలి. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే చైతూకి జోడీగా రకుల్‌ పేరు వినిపిస్తోంది. కానీ ఈ విషయమైన కొన్ని అనుమానాలున్నాయి. చైతూకి జోడీగా కొత్త భామను తీసుకుంటే బావుంటుందని భావిస్తున్నారట. ఆ కోవలో నభా నటేష్‌, కళ్యాణీ ప్రియదర్శిని ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. ఇటీవలే 'ఎఫ్‌ 2' చిత్రీకరణ పూర్తి చేసుకుని వెంకీ ఈ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారనీ తెలుస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
Film industry