Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

100 కోట్ల క్లబ్‌లో ఆ కన్నడ చిత్రం.!

kannada flimin 100 crores club

'కేజీఎఫ్‌' కన్నడ సినిమా టైటిల్‌ అయినా ఇప్పుడీ సినిమా తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్లు కొల్లగొట్టేస్తోంది. 100 కోట్ల క్లబ్‌లోకి చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా బాలీవుడ్‌ జనానికి అయితే తీరని షాక్‌ ఇచ్చింది. ఈ షాక్‌లోంచి తేరుకోవడం బాలీవుడ్‌కి ఎప్పటికి సాధ్యమవుతుందో కానీ, ఈ మధ్య బాలీవుడ్‌లో సినిమాల పరిస్థితి అస్సలేమాత్రం బాగోలేదు. 'బాహుబలి' సినిమా ఎప్పుడయితే బాలీవుడ్‌లో విడుదలై, మంచి విజయం సాధించిందో, ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకున్న సినిమా మరోటి రాలేదు.

ఇక ఇప్పుడు 'కేజీఎఫ్‌' రూపంలో మరోసారి బాలీవుడ్‌ ఉలిక్కిపడింది. బాహుబలి సినిమాతో 'కేజీఎఫ్‌'ని పోల్చలేం కానీ, వసూళ్ల విషయంలో ఆ సినిమా రేంజ్‌ని అందుకునేలా ఉందీ సినిమా. తెలుగులో కూడా మంచి విజయం దక్కించుకుంది 'కేజీఎఫ్‌'. యష్‌, శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కింది 'కేజీఎఫ్‌'. ఇకపోతే ఈ సినిమాతో పాటు విడుదలైన 'జీరో'పై భారీ ఆశలు పెట్టుకుంది బాలీవుడ్‌. కానీ ఆ ఆశలు నిరాశలైపోయాయి. 'జీరో' ఆశించిన రిజల్ట్‌ అందుకోలేదు సరికదా, డిజాస్టర్‌గా మిగిలింది. షారూఖ్‌ఖాన్‌, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ తదితర భారీ కాస్టింగ్‌ ఉన్నా, ఓ అనువాద చిత్రం ముందు జీరో జీరోగా మిగిలిపోయింది. ఈ దెబ్బ నుండి బాలీవుడ్‌ ఎప్పటికి తేరుకుంటుందో చూడాలో మరి.

మరిన్ని సినిమా కబుర్లు
churaka