Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
It is true Venkatesh says.

ఈ సంచికలో >> సినిమా >>

'ఆర్‌ఆర్‌ఆర్‌' స్టోరీ అదేనా.?

'RRR 'story is it?

'బాహుబలి' సినిమాల తర్వాత జక్కన్న రాజమౌళి టేకప్‌ చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాయి 'బాహుబలి' సిరీస్‌ సినిమాలు. అయితే తదుపరి చిత్రంగా జక్కన్న ఎంచుకున్న ప్రాజెక్ట్‌ ఓ మెగా మల్టీ స్టారర్‌ కావడంతో అందరి దృష్టీ ఆ సినిమాపై ఉండడం సహజమే. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌ని పట్టుకుని జక్కన్న చెక్కబోయే చిత్రం ఎలా ఉండబోతోంది.? ఎలాంటి కథ అయ్యి ఉంటుంది.? అనే అంశాలపై పలు రకాల ఆశక్తి నెలకొంది. అందుకే సోషల్‌ మీడియాలో ఇదే అంశమై తెగ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌ ఇదై ఉంటుంది. అదై ఉంటుంది అంటూ రకరకాలా డిజైన్లు సృష్టించేస్తున్నారు అభిమానులు.

నెక్స్ట్‌ ఈ సినిమా కథపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇది బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందే చిత్రమనీ గాసిప్స్‌ వచ్చాయి. కాదు పీరియాడిక్‌ మూవీ అంటూ మరికొన్ని గాసిప్స్‌ వినిపించాయి. తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్టోరీ ఇదేనంటూ కొత్త గాసిప్‌ వైరల్‌ అవుతోంది. 'మగధీర' మాదిరిగా పునర్జన్మ కాన్సెప్ట్‌లో తెరకెక్కే సినిమా ఇది అంటూ ఓ స్టోరీ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. చరణ్‌, ఎన్టీఆర్‌ స్నేహితులగా చనిపోతారట. ఆ తర్వాత మళ్లీ పుడతారట. పునర్జన్మలో వారి మధ్య స్నేహం అలాగే ఉంటుందట. ఈ కాన్సెప్ట్‌ని బేస్‌ చేసుకుని ఈ సినిమా రూపొందనుందనే గాసిప్‌ ప్రస్తుతం హాట్‌ హాట్‌గా వైరల్‌ అవుతోంది. ఒక్కోసారి ఊహాగానాలు కూడా నిజమే అవుతూ ఉంటాయి. కానీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలో ఏం జరుగుతుందనేది తెలియాలంటే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ రాజమౌళి రివీల్‌ చేస్తే కానీ చెప్పలేం.

మరిన్ని సినిమా కబుర్లు
movie of the year rangasthalam