Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

మెగా బ్రదర్‌ మ్యాటరేంటంటే.. బ్రదర్‌.!

mega brother

అభిమానులు మెగాబ్రదర్‌ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు నాగబాబును. ఆయన ఏం మాట్లాడినా కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడుతుంటారు. అందుకే అప్పుడప్పుడూ ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమైన పరిస్థితులు చాలానే ఉన్నాయి గతంలో. తాజాగా మెగా బ్రదర్‌ వ్యాఖ్యలు మరోసారి సంచలనమయ్యాయి. జనసేన వ్యవస్థాపకుడిగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరమై రాజకీయాలకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఆయన జనసేన పార్టీకి తన తరపున నాగబాబు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. బిజీగా ఉన్న కారణంగా ఇంతవరకూ తమ్ముడి వెంట నడవలేకపోయాం. ఇకపై ఆయన వెంట నడుస్తాం అన్నట్లుగా సంకేతాలు పంపించారు. ఇది కూడా బాగానే ఉంది.

అసలు సిసలు మ్యాటరేంటంటే, సోషల్‌ మీడియాలో నాగబాబు వెరీ లేటెస్టుగా ఓ వీడియోని పోస్ట్‌ చేశారు. ఓ చిన్న బాబు 'సారే జహాసే అచ్చా' పాడుతున్న వీడియో అది. ఇంత చిన్న పిల్లగాడు ఎంత చక్కగా పాడాడో 'సారే జహాసే అచ్చా' అని ముచ్చటపడుతూ నాగబాబు ఆ వీడియోని పోస్ట్‌ చేశాడు. అయితే ఇది బాలయ్య ఫ్యాన్స్‌కి మరోలా కనెక్ట్‌ అయ్యింది. ఈ మధ్య తెలంగాణా ఎన్నికల నిమిత్తం తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా 'సారే జహాసే అచ్చా' పాట పాడడంలో తడబడ్డారు. దాంతో బాలయ్యకే సెటైరికల్‌గా ఆ వీడియో పెట్టాడని భావించిన బాలయ్య ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో నాగబాబుపై ట్రోలింగ్‌ స్టార్ట్‌ చేశారు. గతంలో ఓ సారి బాలయ్య అంటే ఎవరో నాకు తెలియదని వ్యగ్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న బాలయ్య ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో నాగబాబుని ఆడేసుకుంటున్నారు. అదీ మ్యాటర్‌.! 

మరిన్ని సినిమా కబుర్లు
It is true Venkatesh says.