Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'RRR 'story is it?

ఈ సంచికలో >> సినిమా >>

మూవీ ఆఫ్‌ ది ఇయర్‌ 'రంగస్థలం'.!

movie of the year rangasthalam

2018లో మెగా కాంపౌండ్‌ నుండి అతి పెద్ద విజయం రామ్‌ చరణ్‌ పేరు మీదే నమోదైంది. 'తొలిప్రేమ'తో వరుణ్‌ సాధించిన ఓ మోస్తరు విజయం తప్ప మెగా కాంపౌండ్‌లో చెప్పుకోదగ్గ విజయం మరోటి లేదు. చరణ్‌ విషయానికి వస్తే, డైరెక్టర్‌ సుకుమార్‌తో కలిసి 'రంగస్థలం' అనే అద్భుతాన్ని 2018లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆఫ్‌ బీట్‌ ఫిలిం అనీ, ఇంకోటనీ తొలుత ఈ సినిమాని చాలా మంది లైట్‌ తీసుకున్నారు. రీ షూట్స్‌ జరిగాయనీ, అసలు సినిమా బాగా రాలేదనీ, చాలా పుకార్లు షికారు చేశాయి. సినిమా రిలీజయ్యాక కూడా ఓ మోస్తరుగా వెక్కిరింతలు కనిపించాయి. కానీ అవేమీ సినిమా సక్సెస్‌ని అడ్డుకోలేకపోయాయి.

సుకుమార్‌, చరణ్‌తో పాటు నిర్మాతలు చేసిన రిస్క్‌ వృధా పోలేదు. తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ అతికొద్ది చిత్రాల్లో ఒకటిగా రంగస్థలం నిలబడేంత మంచి విజయాన్ని, విమర్శకుల ప్రశంసల్నీ అందుకుంది 'రంగస్థలం'. ఓ దర్శకుడి విజన్‌, ఓ నటుడి సాహసం, నిర్మాతల నమ్మకం ఇవన్నీ 'రంగస్థలం' విజయంలో కీలక పాత్ర పోషించాయి. మరోపక్క 'మహానటి' ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో మరో అరుదైన చిత్రం. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అతి పెద్ద బాధ్యతను అత్యంత చాకచక్యంగా నిర్వర్తించాడు. 'గీత గోవిందం', 'భరత్‌ అనే నేను' తదితర చిత్రాలు ఈ ఏడాది మంచి విజయాల్ని అందుకున్నాయి. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam