Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mega brother

ఈ సంచికలో >> సినిమా >>

వెంకటేష్‌ చెప్పింది నిజమే.!

It is true Venkatesh says.

అగ్ర హీరో వెంకటేష్‌, యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం 'ఎఫ్‌ 2'. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ అనేది ఈ సినిమా క్యాప్షన్‌. టైటిల్‌కి తగ్గట్లుగా ఈ సినిమా స్టోరీని టీజర్‌ రూపంలో శాంపిల్‌గా చూపించేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరి 12న విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ వేడిని మెల్ల మెల్లగా పెంచుతూ వచ్చింది చిత్ర యూనిట్‌. అందులో భాగంగానే తొలి ఆడియో సింగిల్‌ రిలీజ్‌ చేసింది. అదరహో అనిపించింది.

ఆ తర్వాత లేటెస్టుగా వచ్చిన సెకండ్‌ ఆడియో సింగిల్‌లో 'ఎంతో ఫన్‌..' అనే సాంగ్‌ విడుదలైంది. లిరికల్‌ సాంగ్‌తో పాటు, మేకింగ్‌ వీడియోలు కూడా విడుదల చేసి, సినిమాలపై ఆశక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. అలాగే 'ఎఫ్‌ 2' విషయంలోనూ చేశారు. ఈ సెకండ్‌ ఆడియో సింగిల్‌ పూర్తిగా తమన్నా, వెంకీలపై షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. విడుదలైన మేకింగ్‌ వీడియోలో తమన్నా, వెంకీ లవ్‌, మ్యారేజ్‌, మ్యారేజ్‌ తర్వాత వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, వెంకీలోని ఫన్నీ సైన్స్‌ ఇలా పలు రకాల అంశాల్ని టచ్‌ చేశారు. వెంకటేష్‌తో, తమన్నా తొలిసారి జత కడుతోన్న చిత్రమిది. ఆన్‌స్క్రీన్‌ వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే వెంకీ యూత్‌ఫుల్‌ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. వరుణ్‌తేజ్‌, వెంకటేష్‌ ఈ సినిమాలో తోడల్లుళ్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన అనిల్‌ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు. అభిరుచి నిర్మాత దిల్‌రాజు వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాకింగ్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
'RRR 'story is it?