Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

వినయ విధేయ రాముడు తక్కువోడేం కాదు.!

ramcharan in vnavidheya rama

సీత కోసం శివుని విల్లుని ఎత్తినోడు ఆ రఘురాముడైతే.. అరచేతిలో సీతను ఎత్తినోడు ఈ వినయ విధేయ రాముడు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న 'వినయ విధేయ రామ' చిత్రంలోని ఈ స్టిల్‌ గురించి అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారిప్పుడు. ఇంతకన్నా బెస్ట్‌ పోజు ఇంకేముంటుంది.? అని ఆశ్చర్యపోతున్నారంతా ఈ స్టిల్‌ చూసి. ఈ సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సందర్భంగా ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు చిత్ర యూనిట్‌. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మన రాముడి పక్కన సీతగా కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రమోషన్స్‌లో ఒకింత క్లాస్‌, ఒకింత మాస్‌ మిక్స్‌ చేసి, కలర్‌ఫుల్‌గా పోస్టర్స్‌ని డిజైన్‌ చేసి వదులుతున్నారు. చరణ్‌ కండలు తిరిగిన శరీరం యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఒంటి నిండా టాటూలతో హాలీవుడ్‌ హీరో రాంబోని తలపిస్తున్నాడు చరణ్‌. పక్కా ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీగా వినయ విధేయ రామ సినిమాలో ఫ్లేవర్‌ కనిపిస్తోంది. డివివి దానయ్య అస్సలేమాత్రం ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని తెరకెక్కించారనీ ప్రచార చిత్రాల్లో విజువల్స్‌ చూస్తుంటే అర్ధమవుతోంది. 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత చరణ్‌ నుండి వస్తున్న సినిమా కావడం, ప్రచార చిత్రాల ద్వారా క్రియేట్‌ అయిన హైప్‌ చూస్తుంటే, కొత్త సంవత్సరంలో చరణ్‌ నుండి 'వినయ విధేయ రామ' రూపంలో మరో బ్లాక్‌ బస్టర్‌ ఖాయమనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ ఆల్రెడీ దుమ్ము రేపేస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
churaka