Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
hot item bombs

ఈ సంచికలో >> సినిమా >>

'ఎఫ్‌ 2'తో సంక్రాంతి ఫుల్‌ నవ్వుల్‌ నవ్వుల్‌.!

f2 movie release on sankranti

దిల్‌రాజు బ్యానర్‌లో వెంకీ, వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్‌ మూవీ 'ఎఫ్‌ 2'. ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌కి పెట్టింది పేరైన అనిల్‌ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఎలాంటి సినిమా అయినా కొట్టుకుపోతుంది. అలాంటిది పండక్కి అసలు సిసలు ఎంటర్‌టైనింగ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఎఫ్‌ 2' ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపనుంది. వెంకీ కామెడీ టైమింగ్‌ అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కి మంచి పేరుంది. 'దృశ్యం', గోపాల గోపాల', 'గురు' తదితర చిత్రాలతో ఈ మధ్య వయసుకు తగ్గ పాత్రలతో అలరించారు వెంకటేష్‌. కానీ ఈ సారి మాత్రం వయసును తగ్గించేసుకుని, ఫుల్‌ రొమాంటిక్‌ హీరోగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి సిద్ధమైపోయాడు 'ఎఫ్‌2' ద్వారా విక్టరీ వెంకటేష్‌. పక్కా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది ఎఫ్‌ 2. ఇకపోతే మరో హీరో వరుణ్‌తేజ్‌ విషయానికొస్తే, 'తొలిప్రేమ'తో రొమాంటిక్‌ హిట్‌ని సొంతం చేసుకున్నాడు.

హిట్‌ వచ్చింది కదా అని అదే ట్రాక్‌ ఫాలో చేయకుండా, విభిన్నంగా ఆలోచించి 'అంతరిక్షం' సినిమాని పూర్తి చేశాడు. అయితే బ్యాడ్‌లక్‌. ఈ సినిమా విషయంలో ఈక్వేషన్స్‌ తారుమారయ్యాయి. ఇప్పుడు వెంకీతో కలిసి పోటా పోటీగా కామెడీ చేసేయడానికి సిద్ధమైపోయాడీ యంగ్‌ హీరో. తోడల్లుళ్లుగా నటిస్తున్న వెంకీ, వరుణ్‌లు 'ఎఫ్‌ 2'తో పిచ్చ పిచ్చగా నవ్వించేస్తామంటున్నారు. తమన్నా, మెహ్రీన్‌ తమ అందాలతో కెవ్వుకేక పుట్టించేస్తామంటున్నారు. సంక్రాంతికి సకుటుంబ సపరివారంగా విచ్చేయదగ్గ సినిమా 'ఎఫ్‌ 2' అవుతుందని ఖచ్చితంగా చెబుతున్నారు. చూడాలి మరి ఈ సంక్రాంతి అల్లుళ్ల హంగామా ఎలా ఉండబోతోందో.! 

మరిన్ని సినిమా కబుర్లు
saptagiri in vajrakavachadhara movie