Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
f2 movie release on sankranti

ఈ సంచికలో >> సినిమా >>

సప్తగిరి 'వజ్రకవచధార గోవిందా'.!

saptagiri in vajrakavachadhara movie

కమెడియన్‌ సప్తగిరి హీరో అవతారమెత్తి రెండు సినిమాలతో హిట్స్‌ కొట్టాడు. అదే జోష్‌తో ఇప్పుడు మూడో సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. మొదటి సినిమాకి 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' అనీ, రెండో సినిమాకి 'సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' అనీ టైటిల్స్‌ పెట్టుకుంటే, మూడో సినిమాకి 'వజ్రకవచధార గోవిందా' అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ని పెట్టుకున్నాడు. అయితే ఈ గోవిందుడు ఏం చేస్తాడా.? అంటే ఓ చిలిపి దొంగట. దొంగే అని తక్కువగా చూడకండోయ్‌. ఈ ఫన్నీ దొంగోడికీ ఓ టార్గెట్‌ ఉంది. ఆ టార్గెట్‌ని అందుకోవడానికి ఆ ఫన్నీ దొంగ ఏం చేసాడు.? అనేది తెలియాలంటే 'వజ్రకవచధార గోవింద.' సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలోనూ పాటలు, డాన్సులు, యాక్షన్‌, ఇక కామెడీ సంగతి చెప్పనే అక్కర్లేదు.. ఇలా అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయట. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైష్ణవీ జోషి హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమాకి అరుణ్‌ పవార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సప్తగిరిని హీరోగా పరిచయం చేసింది కూడా ఈయనే కావడం విశేషం. మొత్తానికి గోవిందుడి సెంటిమెంట్‌ సప్తగిరికి మూడోసారి కూడా వర్కవుట్‌ అవుతుందేమో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
majnu teaser relesed