Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

వింటర్‌లో సెగలు పుట్టించేసిన బికినీ చేపలు.!

hot item bombs

కూల్‌ కూల్‌ వింటర్‌, అసలే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు బాగా తగ్గి, చలిపులి విజృంభించేసింది. ఈ తరుణంలో ముద్దుగుమ్మలు చేసిన సాహసం అంతా ఇంతా కాదు. చలికి జనం వణికిపోతుంటే, ముద్దుగుమ్మలు మాత్రం బికినీల్లో బీచ్‌ల పక్కన అందాలను ఆవగా ఆరేసి, కుర్రకారుకు హీటు సెగలు పుట్టించేశారు. 'లోఫర్‌' బ్యూటీ దిశాపటానీ అయితే ఎక్కువ శాతం ఇన్నర్‌ వేర్‌లోనే దర్శనమిచ్చింది . ఓ ఇన్నర్‌ వేర్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పని చేసిన దిశాపటానీ ఆ సంస్థకు ఎక్కడా లేని పాపులారిటీ తెచ్చిపెట్టింది తన అందాల ప్రదర్శనతో. అలాగే 'మనసుకు నచ్చింది' ఫేం అమైరాదస్తూర్‌ కూడా ఏమంత తక్కువ చేయలేదు.

బికినీల్లో దిమ్మ తిరిగే పోజులిచ్చి కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీ బికినీ సెగలకు కుర్రకారు గుండె బేజారే. 'భరత్‌ అనే నేను' సినిమాతో యూత్‌లో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించిన కైరా అద్వానీ సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోయి అలరించింది. అందాల భామ అమీజాక్సన్‌ కూడా వింటర్‌ వెకేషన్‌ని బీచ్‌లో బికినీలతో ఎంజాయ్‌ చేసి, కూల్‌ వింటర్‌ని హాట్ట్‌గా మార్చేసింది. వీరే కాదండోయ్‌ ఇంకా స్నేహా ఉల్లాల్‌, రియా చక్రవర్తి, పూనమ్‌ పాండే, షెర్లీన్‌ చోప్రా తదితర హాట్‌ ఐటెం బాంబ్స్‌ కూడా బికినీలతో పెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసి, చలికాలం కుర్రకారు ఈడుకు వెచ్చని గిలిగింతలు పుట్టించారు. 

మరిన్ని సినిమా కబుర్లు
f2 movie release on sankranti