స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో గతంలో రెండు చిత్రాలొచ్చాయి. రెండూ సూపర్ డూపర్ హిట్సే. ఇదే హిట్ ఫార్ములాని ఇప్పుడు వీరిద్దరూ రిపీట్ చేయాలని కసితో ఉన్నారట. త్రివిక్రమ్ సినిమాలు ఈ మధ్య సాగతీత కథలతో చప్పగా సాగుతున్నాయి. అయితే ఈ సారి మాత్రం తన కలానికి బాగా పదును పెట్టి, చురుకైన డైలాగ్స్‌ని సిద్ధం చేశాడట. అలాగే బన్నీ నుండి కూడా ఓ మంచి హిట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ, ఈ సారి వస్తే గిస్తే అలాంటిలాంటి స్టోరీతో రాను. సూపర్బ్ థ్రిల్ ఇస్తానని ఫ్యాన్స్‌కి మాటిచ్చి మరీ బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ఎంతో మంది డైరెక్టర్స్‌ని పరిశీలించి చివరికి త్రివిక్రమ్‌కి కనెక్ట్ అయ్యాడు.
మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే బన్నీ ఏం చేయబోతున్నాడో అనే అనుమానాలు అభిమానుల్లో ఉంటాయి. అందుకే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఓ ఫ్రెష్ అప్‌డేట్ ఇవ్వనున్నారట. ప్రస్తుతానికి జబర్దస్త్ మేకోవర్ కోసం బన్నీ సంసిద్ధమవుతున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సారి బన్నీ ఎలాంటి ప్రయోగాల జోలికి పోడట. పక్కా కూల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌నే ఇస్తానంటున్నాడు. చూడాలి మరి బన్నీ చెప్పిన మాట నిలబెట్టుకుంటాడో లేదో.? ఈ సారైనా ఓ మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో.?
|