ఎప్పుడయితే నయనతార హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడం మొదలు పెట్టిందో, అప్పటి నుండి ఆమె కోసం కొత్త కొత్త కథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకటీ అరా తప్ప, మిగిలినవన్నీ మంచి విజయం అందుకుంటున్నాయి. అదే ఉత్సాహంతో సర్జన్ దర్శకత్వంలో నయన్‌తార హీరోయిన్‌గా ఓ మూవీ రూపొందుతోంది. ఆషామాషీ సినిమా కాదట ఇది. ఇంతవరకూ నయన్‌ని ఎవ్వరూ చూపించనంత అద్భుతంగా డైరెక్టర్ ఈ సినిమాలో చూపించబోతున్నారట. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. తొలిసారి కెరీర్‌లో డబుల్ రోల్ పోషిస్తోంది నయన్ ఈ సినిమాలో. డబుల్ రోల్ సినిమాలంటే మనకో ఐడియా ఉందింతవరకూ. ఒకే పోలికలతో ఉన్నవాళ్లంటే ఎక్కడి నుండి ఎక్కడికో లింక్ పెట్టి, వారిని అక్క చెల్లెళ్లుగానో, అన్నదమ్ములుగానో లేక తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లగానో ఏదో ఒక రిలేషన్ పెట్టి చూపించారు .
ఇంతవరకూ మన దర్శకులు. అయితే ఈ సినిమాలోని నయనతార పోషించిన సేమ్ క్యారెక్టర్స్ రెండింటికీ అస్సలేమాత్రం రిలేషన్ ఉండదట. అదే ఈ సినిమాకి పెద్ద ట్విస్ట్ అట. అంతేకాదు, ఈ సినిమాలో నయనతార ఓ క్యారెక్టర్ కోసం డీగ్లామర్ రోల్‌లో కనిపించనుందట. అది కూడా మాసిన ముఖంతో కారు నలుపు మేని ఛాయతో కనిపించనుందట. ఇంతకు ముందెప్పుడూ టచ్ చేయని మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ అట అది. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా.? 'ఐరా'. ఇదేమీ నయనతార క్యారెక్టర్ పేరు కాదు. 'ఐరా' అంటే చాలా శక్తివంతమైంది అని అర్ధమట. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న 'ఐరా'ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిత్ర యూనిట్ తెలిపింది.
|